prajavaani.net
Newspaper Banner
Date of Publish : 30 September 2026, 10:38 am Digital Edition : PRAJA VANI

నెలకు సరిపడే నిత్యావసర సరుకుల పంపిణీ

నెలకు సరిపడే నిత్యావసర సరుకుల పంపిణీ

వేద జనని వేదిక స్మార్త పీఠం ఆధ్వర్యంలో సేవా కార్యక్రమం

సెప్టెంబర్ 30, (ప్రజావాణి ) నారాయణఖేడ్ నియోజకవర్గం లోని కంగ్టి మండల కేంద్రంలో శ్రీ వేద జనని వేదిక స్మార్త పీఠం (మెల్‌బోర్న్ & హైదరాబాద్) ఆధ్వర్యంలో సేవా కార్యక్రమం నిర్వహించారు. కీర్తిశేషులు బి. భాస్కర్ సంతానం సందీప్‌కుమార్‌కు నెలకు సరిపడే నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా శ్రీ వేద జనని వేదిక స్మార్త పీఠం దాతృత్వంతో అందించిన నిత్యావసర సరుకులను యశ్వంత్ చేతుల మీదుగా సందీప్‌కుమార్‌కు అందజేశారు. కార్యక్రమంలో సహకరించిన వేద జనని వేదిక స్మార్త పీఠం నిర్వాహకులకు, చంద్రశేఖర్ ఆచార్యకు కర్ర గోవింద్ నాయక్ కృతజ్ఞతలు తెలిపారు.ఆపదలో ఉన్న కుటుంబాలకు అండగా నిలుస్తూ నిత్యావసర వస్తువులు అందించడం అభినందనీయమని కార్యక్రమంలో పాల్గొన్న వారు పేర్కొన్నారు.