prajavaani.net
Newspaper Banner
Date of Publish : 04 September 2026, 11:26 am Digital Edition : ELKATHURTHI

నూతన సీఐ శ్రీనివాస్‌ను కలిసిన రైతు రక్షణ సమితి ప్రతినిధులు

నూతన సీఐ శ్రీనివాస్‌ను కలిసిన రైతు రక్షణ సమితి ప్రతినిధులు

రైతు రక్షణ సమితి హనుమకొండ,ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు హింగే భాస్కర్

ఎల్కతుర్తి ప్రజావాణి న్యూస్:-

హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి సర్కిల్‌కు నూతనంగా వచ్చిన సీఐ శ్రీనివాస్‌ను రైతు రక్షణ సమితి హనుమకొండ, ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు హింగే భాస్కర్ మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మండలంలోని రైతుల సమస్యలను ఎప్పటికప్పుడు త్వరగా పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని కోరారు.సీఐ శ్రీనివాస్ స్పందిస్తూ రైతులకు ఏదైనా సమస్య ఉంటే నేరుగా వచ్చి కలిసి వివరించాలని, చట్టపరంగా సమస్యల పరిష్కారానికి సహకరిస్తానని తెలిపారు.కార్యక్రమంలో జిల్లా ముఖ్య సలహాదారు సుకినే సుధాకర్ రావు, మండల అధ్యక్షుడు కొక్కు తిరుపతి,ప్రధాన కార్యదర్శి కోదాటి మాధవరావు తదితరులు పాల్గొన్నారు.