నివాళులర్పించిన ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి
*నివాళులర్పించిన ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి* *చిలిపిచెడ్, సెప్టెంబర్ 23 (ప్రజావాణి):* మెదక్ జిల్లా చిలిపిచెడ్ మండల పరిధిలోని బండాపోతుగల్ గ్రామానికి చెందిన బీఆర్ఎస్ సీనియర్ నాయకులు సయ్యద్ హుస్సేన్ మాతృమూర్తి ఖాజాబీ బేగం (87) అనారోగ్యంతో మృతి చెందడం బాధాకరమని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి అన్నారు. ఖాజాబీ బేగం మృతి వార్త తెలుసుకున్న వెంటనే ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి హుటాహుటిన బండాపోతుగల్ గ్రామానికి చేరుకున్నారు. ఆమె పార్థివదేహంనికిఘనంగా నివాళులర్పించారు. అనంతరం శ్రద్ధాంజలి ఘటించారు. తరువాత శోకసంద్రంలో మునిగిపోయిన కుమారుడు సయ్యద్ హుస్సేన్ మరియు...