*నిరుపేద విద్యార్థులకు కండె శ్రావ్య విజయం స్ఫూర్తిదాయకం*
దాద్‌పల్లి, సెప్టెంబర్ 27 (ప్రజావాణి): మంచాల మండలం దాద్‌పల్లి గ్రామానికి చెందిన కండె మల్లేష్ గుప్తా కుమార్తె కండె శ్రావ్య భద్రాద్రి కొత్తగూడెం ప్రభుత్వ వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ సీటు సాధించడం గ్రామానికి గర్వకారణంగా నిలిచింది. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు శ్రావ్యను హనుమాన్ దేవాలయం వద్ద స్వీట్లు తినిపించి, శాలువాతో ఘనంగా సన్మానించి అభినందించారు.
ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకుడు పాలకుర్ల శేఖర్ గౌడ్ మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల నుంచి, ముఖ్యంగా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న కుటుంబాలకు చెందిన విద్యార్థులు చదువుపై ఆసక్తి పెంచుకుని ఉన్నత లక్ష్యాలను సాధించాలని అన్నారు. ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా లేకపోయినా పట్టుదలతో చదివితే ఉన్నత విద్యలో రాణించవచ్చని పేర్కొన్నారు.
నిరుపేద విద్యార్థుల్లో ఎంతో ప్రతిభ ఉన్నప్పటికీ ఆర్థిక ఇబ్బందుల కారణంగా కొందరు ఉన్నత చదువులకు దూరమవుతున్నారని అన్నారు. అలాంటి విద్యార్థులను తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, ప్రజాప్రతినిధులు ప్రోత్సహించి అండగా నిలవాల్సిన అవసరం ఉందన్నారు. విద్యార్థుల చదువుకు ఆర్థిక సహాయం అందించడంతో పాటు అవసరమైన మార్గదర్శకత్వం అందిస్తే వారు ఉన్నత స్థాయికి ఎదిగి కుటుంబానికి, గ్రామానికి మంచి పేరు తీసుకురాగలరని తెలిపారు.
కండె శ్రావ్య ఎంబీబీఎస్ సీటు సాధించడం ఇతర విద్యార్థులకు కూడా స్ఫూర్తిదాయకమని, ఆమెను ఉన్నత చదువుల వైపు ప్రోత్సహించిన తల్లిదండ్రులకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. శ్రావ్య భవిష్యత్తులో మంచి వైద్యురాలిగా ఎదిగి పేదలకు సేవ చేయాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మామిడిపల్లి శ్రీనివాస్, నేనావత్ రాజు నాయక్, శ్రావ్య కుట�