నిమజ్జనానికి మార్గం సుగమం చేసిన కేశపావుల వినోద్…వినాయక విగ్రహాల ఊరేగింపునకు అడ్డుగా ఉన్న చెట్ల కొమ్మల తొలగింపు
పోచారం, సెప్టెంబర్ 14 (ప్రజావాణి): వినాయక చవితి నవరాత్రుల అనంతరం జరిగే వినాయక నిమజ్జన ఊరేగింపును దృష్టిలో పెట్టుకుని ఘట్కేసర్ మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు కేశపావుల వినోద్ కుమార్ ప్రత్యేక చొరవ తీసుకున్నారు. పోచారం డివిజన్‌లోని నారపల్లి నుంచి కొర్రెముల వరకు ప్రధాన రహదారిపై విస్తరించి పెరిగిన చెట్ల కొమ్మలు వినాయక విగ్రహాల ఊరేగింపుకు అడ్డుగా మారే అవకాశం ఉండటంతో సంబంధిత అధికారుల దృష్టికి సమస్యను తీసుకెళ్లారు. కేశపావుల వినోద్ కుమార్ చొరవతో లాడర్ వాహనాన్ని ఏర్పాటు చేసి, రహదారిపైకి వంగి వచ్చిన...