prajavaani.net
Newspaper Banner
Date of Publish : 15 September 2026, 6:40 am Digital Edition : NNARSINGARAO GATKESKAR

నిమజ్జనానికి మార్గం సుగమం చేసిన కేశపావుల వినోద్…వినాయక విగ్రహాల ఊరేగింపునకు అడ్డుగా ఉన్న చెట్ల కొమ్మల తొలగింపు

పోచారం, సెప్టెంబర్ 14 (ప్రజావాణి): వినాయక చవితి నవరాత్రుల అనంతరం జరిగే వినాయక నిమజ్జన ఊరేగింపును దృష్టిలో పెట్టుకుని ఘట్కేసర్ మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు కేశపావుల వినోద్ కుమార్ ప్రత్యేక చొరవ తీసుకున్నారు. పోచారం డివిజన్‌లోని నారపల్లి నుంచి కొర్రెముల వరకు ప్రధాన రహదారిపై విస్తరించి పెరిగిన చెట్ల కొమ్మలు వినాయక విగ్రహాల ఊరేగింపుకు అడ్డుగా మారే అవకాశం ఉండటంతో సంబంధిత అధికారుల దృష్టికి సమస్యను తీసుకెళ్లారు.

కేశపావుల వినోద్ కుమార్ చొరవతో లాడర్ వాహనాన్ని ఏర్పాటు చేసి, రహదారిపైకి వంగి వచ్చిన పెద్ద చెట్ల కొమ్మలను గుర్తించి కత్తిరించి తొలగించే పనులు చేపట్టారు. ముఖ్యంగా భారీ వినాయక విగ్రహాలు, ఊరేగింపు వాహనాలు వెళ్లే మార్గంలో ఎత్తుకు అడ్డుగా ఉన్న కొమ్మలను తొలగించి రాకపోకలకు అనుకూలంగా మార్గాన్ని సిద్ధం చేశారు. కత్తిరించిన కొమ్మలను కూడా రహదారి నుంచి తొలగించి వాహనాల రాకపోకలకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకున్నారు.

వినాయక నిమజ్జన సమయంలో భక్తులు, విగ్రహాలు, ఊరేగింపు వాహనాలకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా ముందుగానే ఈ చర్యలు చేపట్టినట్లు కేశపావుల వినోద్ కుమార్ తెలిపారు. ప్రజల భద్రతకు ప్రాధాన్యతనిస్తూ పండుగ కార్యక్రమాలు ప్రశాంతంగా, సజావుగా జరిగేలా అవసరమైన ముందస్తు ఏర్పాట్లు చేస్తున్నామని పేర్కొన్నారు.