prajavaani.net
Newspaper Banner
Date of Publish : 22 September 2026, 6:07 pm Digital Edition : SUDHAKAR NALGONDA CHANDOOR

నిమజ్జనానికి పకడ్బందీగా ఏర్పాట్లు చేసిన – సిఐ. టి. రాము

నల్గొండ  జిల్లా ప్రతినిధి ప్రజావాణి

చండూరు మండల పరిధిలోని వినాయక నిమజ్జన వేడుకలకు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు చండూరు సిఐ టి. రాము తెలిపారు. పోలీస్ సర్కిల్ పరిధిలో 498 వినాయక విగ్రహాలు ఏర్పాటు చేశారు. నిమజ్జనం, శోభాయాత్రలు ప్రశాంతంగా జరిగేలా రూట్‌మ్యాప్‌ సిద్ధం చేసి బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. కురంపల్లి వద్ద సాగర్‌ ఎడమ కాల్వలో నిమజ్జనానికి ఏర్పాట్లు చేసి, భారీ విగ్రహాల కోసం రెండు క్రేన్లు సిద్ధం చేసినట్లు తెలిపారు. ప్రధాన కూడళ్లలో ట్రాఫిక్‌ మళ్లింపు, అదనపు పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తామన్నారు. సమస్యాత్మక ప్రాంతాలు, శోభాయాత్ర మార్గాల్లో సీసీ కెమెరాలు, డ్రోన్లతో నిఘా ఉంచుతామని, శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే చర్యలు తీసుకుంటామని సీఐ తెలిపారు.