నిన్న సమస్యను పరిశీలించి.. నేడు పరిష్కారం చూపించిన వినోద్…చౌదరిగూడలో పది కాలనీలకు పునరుద్ధరించిన తాగునీటి సరఫరా

పోచారం డివిజన్, సెప్టెంబర్ 29 (ప్రజావాణి): పోచారం డివిజన్ పరిధిలోని చౌదరిగూడ గ్రామంలో పది కాలనీలకు నిలిచిపోయిన తాగునీటి సరఫరాను కేవలం 24 గంటల్లో పునరుద్ధరించడంలో ఘట్‌కేసర్ మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు కేశపాల వినోద్ కుమార్ చొరవ చూపించారు. తాగునీరు అందక కాలనీవాసులు ఇబ్బందులు పడుతున్న విషయం తన దృష్టికి రావడంతో వినోద్ వెంటనే స్పందించి సమస్యను స్వయంగా పరిశీలించారు. అనంతరం సంబంధిత హెచ్‌ఎండబ్ల్యుఎస్ అధికారులతో మాట్లాడి సమస్యను అత్యవసరంగా పరిష్కరించాలని కోరారు. అధికారులతో సమన్వయం చేసుకుని పైప్‌లైన్‌లో ఏర్పడిన సమస్యను గుర్తించి,...