prajavaani.net
Newspaper Banner
Date of Publish : 29 September 2026, 10:45 pm Digital Edition : NNARSINGARAO GATKESKAR

నిన్న సమస్యను పరిశీలించి.. నేడు పరిష్కారం చూపించిన వినోద్…చౌదరిగూడలో పది కాలనీలకు పునరుద్ధరించిన తాగునీటి సరఫరా

పోచారం డివిజన్, సెప్టెంబర్ 29 (ప్రజావాణి): పోచారం డివిజన్ పరిధిలోని చౌదరిగూడ గ్రామంలో పది కాలనీలకు నిలిచిపోయిన తాగునీటి సరఫరాను కేవలం 24 గంటల్లో పునరుద్ధరించడంలో ఘట్‌కేసర్ మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు కేశపాల వినోద్ కుమార్ చొరవ చూపించారు. తాగునీరు అందక కాలనీవాసులు ఇబ్బందులు పడుతున్న విషయం తన దృష్టికి రావడంతో వినోద్ వెంటనే స్పందించి సమస్యను స్వయంగా పరిశీలించారు.

అనంతరం సంబంధిత హెచ్‌ఎండబ్ల్యుఎస్ అధికారులతో మాట్లాడి సమస్యను అత్యవసరంగా పరిష్కరించాలని కోరారు. అధికారులతో సమన్వయం చేసుకుని పైప్‌లైన్‌లో ఏర్పడిన సమస్యను గుర్తించి, అవసరమైన పైప్‌లైన్ జాయింట్ పనులను వెంటనే పూర్తి చేయించారు. దీంతో నిలిచిపోయిన తాగునీటి సరఫరా పునరుద్ధరించడంతో పది కాలనీల ప్రజలకు ఉపశమనం లభించింది.

ఈ సందర్భంగా వినోద్ మాట్లాడుతూ.. “నిన్న సమస్యను తెలుసుకున్నాం.. నేడు పరిష్కారం చూపించాం” అని పేర్కొన్నారు. ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాల విషయంలో సమస్యలు తలెత్తినప్పుడు వెంటనే స్పందించి, అధికారులతో సమన్వయం చేసుకుంటూ పరిష్కారం అందించేందుకు కృషి చేస్తామని తెలిపారు. తాగునీటి సమస్యను వెంటనే పరిష్కరించడంతో చౌదరిగూడలోని కాలనీవాసులు వినోద్‌కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.