prajavaani.net
Newspaper Banner
Date of Publish : 24 September 2026, 8:21 am Digital Edition : PRAJA VANI

నిధులు పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న రెవెన్యూ ఇన్స్పెక్టర్…?

నిధులు పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న రెవెన్యూ ఇన్స్పెక్టర్…?

*నెలల కొద్ది పెండింగ్ పెడుతూ ఇబ్బందులు పెడుతున్న వైనం..?

*జాప్యానికి మారుపేరుగా ఆ రెవెన్యూ ఇన్స్పెక్టర్ 2..?

*ధ్రువీకరణలు పెండింగ్ పై బాధితుల అసహనం

ఖమ్మం బ్యూరో ప్రతినిధి మన ప్రజావాణి

ఖమ్మం జిల్లా చింతకాని మండలంలో ప్రజలకు కులం ఆదాయం ఇతర సర్టిఫికెట్లు సకాలంలో అందక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు విమర్శలు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రధానంగా మండలంలో రెండవ ఇన్స్పెక్టర్గా విధులు నిర్వహిస్తున్న ఓ అధికారి క్షేత్రస్థాయిలో దరఖాస్తులను పెండింగ్లో పెట్టడంతో అప్రూవల్ ఇవ్వకపోవడంతో బాధితులు మీసేవ కేంద్రాల చుట్టూ తిరుగుతూ పడి కాపులు కాస్తున్నట్లు సమాచారం. సదరు రెవిన్ ఇన్స్పెక్టర్ పై ఇటీవల కాలంలో కూడా అనేక ఆరోపణలు విమర్శలు వినిపిస్తున్నాయి. సోషల్ మీడియా వేదికగా కూడా అనేక పోస్టులు చక్కర్లు కొట్టినట్లు తెలిసింది. కాగా సర్ ప్రక్రియలో మార్పులు చేర్పులతో గాను లేదా ప్రభుత్వ సంక్షేమ పథకాలు పొందినందుకు ధృవీకరణలు తప్పనిసరి కావడంతో ఇటీవల ప్రభుత్వం రెవెన్యూ యంత్రాంగానికి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చిన సంగతి తెలిసిందే. క్షేత్రస్థాయిలో జిపిఓ ను దాటుకొని రెవిన్యూ ఇన్స్పెక్టర్కు సంబంధిత దరఖాస్తులు చేరినప్పటికీ పెండింగ్లో పెట్టడం పట్ల పలువురు మండల ప్రజలు బాధితులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై మన ప్రజావాణి ఖమ్మం బ్యూరో ప్రతినిధి సంబంధిత రెవెన్యూ ఇన్స్పెక్టర్ ఏకవీరను వివరణ కోరగా ఇటీవల సోషల్ మీడియాలో వచ్చినట్లు సమాచారం అందడంతో వెంటనే స్పందించినట్లు తన వద్దకు వచ్చిన సర్టిఫికెట్లకు వెంటనే అప్రూవల్ ఇస్తున్నట్లు చెప్పారు. కాగా పందిళ్ళపల్లి వివరాలను గురించి ప్రస్తావించగా అటువంటిది ఏమీ లేదంటూ నీళ్లు నమిలారు. సదరు రెవెన్యూ ఇన్స్పెక్టర్ కస్టర్ పరిధిలో కొన్ని దరఖాస్తులు నెలలు కొద్దీ మగ్గుతున్నట్లు సమాచారం. ఇప్పటికైనా సంబంధిత జిల్లా స్థాయి అధికారులు కలెక్టర్ స్పందించి ఎటువంటి జాప్యం లేకుండా ధ్రువీకరణ పత్రాలు మండల వ్యాప్తంగా అందేందుకు చర్యలు తీసుకోవాలని సదరు రెవిన్యూ ఇన్స్పెక్టర్ పై విచారణ చేయాలని పలువురు బాధితులు మండల ప్రజలు కోరుతున్నారు.

మరికొన్ని సమగ్ర వివరాలతో.. రెండవ కథనంలో…!