prajavaani.net
Newspaper Banner
Date of Publish : 25 September 2026, 8:39 pm Digital Edition : PRAJA VANI

నా పట్టా నాకు ఇవ్వండి మహాప్రభు

నా పట్టా నాకు ఇవ్వండి మహాప్రభు

కూడేరు ప్రజావాణి సెప్టెంబర్ 25 గత వైయస్సార్ ప్రభుత్వ హయాంలో నుండి నేడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడు సంవత్సరాలు కావస్తున్న ఇప్పటివరకు తన పేరుట ఉన్న పట్టాను తనకు ఇవ్వాలని మహిళా రైతు ముత్యాలమ్మ తాసిల్దార్ కార్యాలయం చుట్టు కాళ్ళు అరిగేలా తిరుగుతున్న అధికారులకు కనికరం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు మహిళా రైతుతోపాటు తన కుమారుడు కూడా పట్టా కోసం సంవత్సరాల తరబడి తిరిగిన అధికారులు తమ గోడును పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు వివరాల్లోకి వెళితే కూడేరు మండలంలోని కూడేరు పొలం సర్వే నంబర్ 650-2 లెటర్ పట్టా నంబరు 1764 నందు 2 ఎకరాల 50 సెంట్లు వ్యవసాయ భూమిని తమ ఆధీనంలోనే సాగు చేసుకుంటూ జీవనం గడుపుతున్నామని తెలిపారు వన్ బి అడంగల్ కూడా ఉందని అధికారులు ఎందుకు పట్టా ఇవ్వటం లేదు మాకు అంత చిక్కడం లేదని వాపోయారు ఇప్పటికైనా పట్టా ఇవ్వాల్సిందిగా వేడుకుంటున్నామని అధికారులను కోరారు ఇప్పటికైనా వారి పట్టా ఇస్తారా లేదా అన్నది వేచి చూడాల్సి ఉంది మరి