నాడు కూలి నేడు డాక్టరేట్ పట్టా అందుకున్న – డాక్టర్ బొజ్జ ఆనంద్
నల్గొండ జిల్లా ప్రతినిధి ప్రజావాణి
నల్లగొండ పట్టణ కేంద్రంలో కేశరాజుపల్లి కి చెందిన వ్యవసాయ కుటుంబం బొజ్జ వెంకటయ్య పుష్పమ్మ రెండవ సంతానం కుమారుడు బొజ్జ ఆనంద్ చిన్నతనం నుండి ఎంతో పట్టుదలతో తను అనుకున్న పనులలో నిమగ్రమై ఆ పని సాధించి పెట్టేదాకా పట్టు వదలని విక్రమార్కుడు తను చిన్నప్పటినుంచి ఒక లక్ష్యాన్ని ఎంచుకొని ఆ లక్ష్యంలో విజయం సాధించే దిశగా ముందు అడుగులు వేస్తూ ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎదుర్కొని నిలబడే మనస్తత్వం కలిగిన వ్యక్తి రేయి పగలు కష్టపడి నేడు ఉస్మానియా యూనివర్సిటీలో డాక్టర్ పట్టా అందుకున్న నిరుపేద వ్యవసాయ కుటుంబానికి చెందిన వ్యక్తి బొజ్జ ఆనంద్ తన ప్రాథమిక విద్యాభ్యాసం కేశరాజు పల్లి. పాఠశాలలో పదవ తరగతి చదివి ఆపై చదువులకు నల్లగొండ పట్టణంలో ఇంటర్మీడియట్ పూర్తిచేసుకుని ఉన్నతమైన చదువులకు హైదరాబాద్ లో ఉండి ఎంతో కష్టపడి అద్దె రూమ్ లో ఉండి చదువు మీద మక్కువ పెంచుకొని పీహెచ్డీ పూర్తి చేయాలని కసి పెంచుకొని ఎన్నో కష్టాలు పడి పీహెచ్డీ పూర్తి చేసుకుని నేడు తెలంగాణ రాష్ట్రంలో ప్రతిష్టాత్మకమైన ఉస్మానియా విశ్వవిద్యాలయం ఠాగూర్ ఆడిటోరియంలో జరిగిన 85 వ స్నాతకోత్సవంలో తెలంగాణ రాష్ట్ర గవర్నర్, యూనివర్సిటీ చాన్సలర్ శివ ప్రతాప్ శుక్లా మరియు వైస్ ఛాన్సులర్ ప్రొఫెసర్ కుమార్ మొలగరం మరియు ముఖ్య అతిధి భారత్ బయోటెక్ వ్యవస్థాపకులు డాక్టర్ కృష్ణ ఎల్లా చేతుల మీదుగా పి. హెచ్ .డి. పట్టాను అందుకున్నారు. బొజ్జ ఆనంద్ మాట్లాడుతూ తన తల్లిదండ్రులకి మరియు తన అన్న అనిల్ కుమార్ ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసారు. తన పరిశోధనకు సహకరించిన ప్రొఫెసర్ గుండా ప్రభాకర్ సార్ కి ప్రత్యేకమైన ధన్యవాదాలు చెల్లించారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం జియాలాజీ ప్రొఫెసర్ గుండా ప్రభాకర్ పర్యవేక్షణలో కనగల్లు మరియు గుర్రంపోడు మండలాల్లో హైడ్రోజియాలాజికల్ అండ్ జియోకెమికల్ స్టడీస్ పొటెన్షియల్ జోన్లలో ఫ్లోరైడ్, నైట్రేట్, సోడియం స్థాయిలు అధికంగా ఉన్నట్లు గుర్తించి తగు నివారణ చర్యలను సూచించి తన పరిశోధనను విజయవంతంగా పూర్తి చేసి థీసిస్ ను సమర్పించినందుకు డాక్టరేట్ ను ప్రధానం చేశారు. ఆనంద్ ప్రస్తుతం నల్లగొండ మైన్ జియాలజీ డిపార్ట్మెంట్ లో విధులు నిర్వహిస్తున్నారు. డాక్టరేట్ పట్టా సాధించినందుకు తనకు విద్యాభ్యాసం బోధించిన ఉపాధ్యాయులు లెక్చరర్స్ ప్రొఫెసర్లు, కుటుంబ సభ్యులు రక్తసంబందులు గ్రామస్తులు స్నేహితులు అభినందించారు.