prajavaani.net
Newspaper Banner
Date of Publish : 30 September 2026, 6:54 pm Digital Edition : SUDHAKAR NALGONDA CHANDOOR

నాగార్జున ప్రభుత్వ కళాశాలలో కృత్రిమ మేధస్సు, సైబర్ సెక్యూరిటీ పై మూడు రోజుల శిక్షణ విజయవంతం

నల్గొండ జిల్లా ప్రతినిధి ప్రజావాణి

నాగార్జున ప్రభుత్వ స్వయంప్రతిపత్తి కళాశాల వాణిజ్య మరియు మేనేజ్‌మెంట్ విభాగం ఆధ్వర్యంలో మ్యాజిక్ బాస్ ఇండియా ఫౌండేషన్, ఐబిఎమ్ http://SkillsBuild.org సంయుక్తంగా కృత్రిమ మేధస్సు మరియు సైబర్ సెక్యూరిటీ స్కిల్స్ పై మూడు రోజుల శిక్షణా కార్యక్రమం విజయవంతంగా ముగిసింది. ఈ కార్యక్రమంలో బీబీబీ, బీకామ్ చెందిన 150 మంది విద్యార్థులు ఉన్నారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ ఎస్. ఉపేందర్ మాట్లాడుతూ ఈ మూడు రోజుల కృత్రిమ మేధస్సుతో విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అదేవిధంగా భవిష్యత్తులో కృత్రిమ మేధస్సు మనకు ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో పాల్గొనే విద్యార్థులకు సర్టిఫికెట్లు. ఈ ప్రాజెక్ట్ విజయవంతం చేసిన ఐబిఎమ్ కార్యక్రమ మేనేజర్ గొడు రాఘవేంద్ర శిక్షకురాలు లక్ష్మీ ప్రసన్న కి కళాశాల తరపున ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఈ వాణిజ్య విభాగాధిపతి డా. జె. నాగరాజు ఆధ్వర్యంలో, అధ్యాపకులు ఎస్. వాసుదేవ్, ఎం. సావిత్రి, ఎన్. వెంకట్ రెడ్డి, జాన్ రెడ్డి, శంకర్, వాహిద్ బాబా, నరేష్, శ్వేత, రేణుక, దినేష్, వెంకట్ ఉన్నారు.