prajavaani.net
Newspaper Banner
Date of Publish : 15 September 2026, 7:21 pm Digital Edition : PRAJA VANI

నాగార్జున ప్రభుత్వ కళాశాల విద్యార్థుల సత్తా మరియు సౌత్ జోన్ పోటీలకు ఎంపిక

నాగార్జున ప్రభుత్వ కళాశాల విద్యార్థుల సత్తా మరియు సౌత్ జోన్ పోటీలకు ఎంపిక

నల్గొండ జిల్లా ప్రతినిధి ప్రజావాణి

నాగార్జున ప్రభుత్వ కళాశాల విద్యార్థులు బ్యాడ్మింటన్ విభాగంలో మొదటి బహుమతిని గెలుచుకోవడం జరిగింది . మహాత్మా గాంధీ యూనివర్సిటీ నిర్వహించినటువంటి ఇంటర్ కాలేజీ టోర్నమెంట్లలో ఎన్జీ కళాశాల విద్యార్థులు సత్తా చాటి బహుమతిని గెలుచుకోవడం జరిగింది. ఈ జట్టులో కే దిలీప్ కుమార్ బి ఏ తృతీయ సంవత్సరం కే శివాజీ బి ఏ తృతీయ సంవత్సరం కే భార్గవానంద్ బిఎస్సి తృతీయ శ్రీకర్ బయోటెక్నాలజీ ఫైనల్ ఇయర్ మహమ్మద్ మాస్ బీకాం ప్రథమ సంవత్సరం లు జట్టుకు ప్రాతినిధ్యం వహించారు ఈ జట్టులో అత్యంత ప్రతిభ కనబరిచిన ఇద్దరు క్రీడాకారులు శ్రీకర్ బయోటెక్నాలజీ ఫైనల్ ఇయర్ విద్యార్థి మరియు మహమ్మద్ మాస్ బీకాం ప్రథమ సంవత్సరం ఈ ఇద్దరు విద్యార్థులు మహాత్మా గాంధీ యూనివర్సిటీ జట్టుకు ప్రాతినిధ్యం వహించనున్నారు. త్వరలో కర్ణాటక రాష్ట్రంలోని బళ్ళారి లో జరిగే ఇంటర్ యూనివర్సిటీ సౌత్ జోన్ పోటీలలో పాల్గొననున్నారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ సముద్రాల ఉపేందర్ మరియు కళాశాల ఇన్చార్జి ఫిజికల్ డైరెక్టర్ డాక్టర్ అదే మల్లేశం విద్యార్థులను అభినందించారు.