నాగలగుంట్ల గ్రామంలో ఘనంగా వినాయక చవితి వేడుకలు: ప్రత్యేక పూజల్లో పాల్గొన్న మాజీ ప్రభుత్వ సలహాదారు పోతిరెడ్డి నాగార్జున రెడ్డి
పోరుమామిళ్ల సెప్టెంబర్ 16 ప్రజావాణి మండలం నాగలగుంట్ల గ్రామంలో వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలు అత్యంత భక్తిశ్రద్ధలతో, వైభవంగా జరుగుతున్నాయి. పండుగ పురస్కరించుకుని గ్రామంలో ప్రతిష్టించిన శ్రీ విఘ్నేశ్వర స్వామి విగ్రహం వద్ద నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ప్రభుత్వ సలహాదారు పోతిరెడ్డి నాగార్జున రెడ్డి విచ్చేశారు. గ్రామస్తులు, స్థానిక యువత ఆయనకు ఘన స్వాగతం పలికారు. అనంతరం స్వామివారిని దర్శించుకున్న ఆయన, ప్రత్యేక పూజలు మరియు హారతి కార్యక్రమాల్లో పాల్గొన్నారు.గ్రామ యువత, వివిధ నగరాల్లో ఉద్యోగాలు చేస్తున్న స్థానికులు...