*నాంపల్లి కోర్టులో హరీశ్‌రావు వాంగ్మూలం!*
*అద్దంకి దయాకర్ ఆరోపణలపై కొనసాగుతున్న న్యాయ ప్రక్రియ..*
అమీన్పూర్, సెప్టెంబర్ 30(ప్రజావాణి):బీఆర్‌ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావుపై అద్దంకి దయాకర్ చేసిన ఆరోపణలకు సంబంధించి నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టులో న్యాయపరమైన ప్రక్రియ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో హరీశ్‌రావు స్టేట్‌మెంట్/వాంగ్మూలం రికార్డు చేసే ప్రక్రియలో హైకోర్టు అడ్వకేట్ ఐలాపూర్ మాణిక్ యాదవ్ పాల్గొన్నారు.
హరీశ్‌రావుతో కలిసి మాణిక్ యాదవ్‌తో పాటు బీఆర్‌ఎస్ లీగల్ సెల్ నాయకులు, పార్టీ నాయకులు కోర్టు ప్రక్రియలో పాల్గొన్నారు. ప్రజా జీవితంలో ఉన్న నాయకులపై వచ్చే ఆరోపణలకు చట్టపరమైన మార్గంలో సమాధానం చెప్పడం, న్యాయస్థానంపై విశ్వాసంతో ముందుకు సాగడం రాజ్యాంగబద్ధమైన బాధ్యత అని మాణిక్ యాదవ్ పేర్కొన్నారు.
న్యాయం, రాజ్యాంగం, ప్రజల ప్రయోజనాల కోసం చట్టపరమైన మార్గంలో ముందుకు సాగుతామని ఆయన తెలిపారు.