prajavaani.net
Newspaper Banner
Date of Publish : 27 September 2026, 7:09 am Digital Edition : PRAJA VANI

నస్రుల్లాబాద్ మండల గ్రామాలలో పురుగుల పోషవ్వ పండగలు

*నస్రుల్లాబాద్ మండల గ్రామాలలో పురుగుల పోషవ్వ పండగలు.*

నస్రుల్లాబాద్ సెప్టెంబర్ 27 (ప్రజావాణి) నసరుల్లాబాద్ మండలం గ్రామాలలో ఆదివారము గ్రామస్తుల ఆధ్వర్యంలో పురుగుల పోషవ్వ దేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు గ్రామస్తులు ప్రతి కులస్తులు వచ్చి గ్రామ శివారిలో దేవతలను సందర్శించి పొలాల పంటలు పురుగులు భారీ నుండి రక్షించమని పురుగుల పోషభకు మొక్కుకున్నారు ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు కులస్తులు ముందుండి నిర్వహించారు పురుగుల పోషకు నైవేద్యం సమర్పించి కొబ్బరికాయలు కొట్టి మేకలు కోశారు అన్ని కులస్తులు గ్రామ పెద్దలు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ హరికి సాయిలు మాట్లాడుతూ మా పంట పొలాలను పురుగుల వారిని కాపాలను గ్రామంలోని ప్రతి కుటుంబానికి ఆరోగ్యం ఉండాలని పురుగుల పోసేవకు మొక్కుకున్నారు ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు అందజేశారు ఈ కార్యక్రమంలో అన్ని కులస్తులు గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.