prajavaani.net
Newspaper Banner
Date of Publish : 20 September 2026, 8:15 pm Digital Edition : PRAJA VANI

నవ యువ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అన్నప్రసాద వితరణ

నవ యువ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అన్నప్రసాద వితరణ

ఘనంగా వినాయక చవితి 39 వ వార్షికోత్సవ వేడుకలు

నల్గొండ జిల్లా ప్రతినిధి ప్రజావాణి

గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా నల్గొండ జిల్లా చండూరు మున్సిపాలిటీ పరిధిలోని ఒకటో వార్డు సత్య హరిచంద్ర నగర్‌లో ఏర్పాటు చేసిన గణేష్ మండపం వద్ద ఏడవ రోజు ప్రత్యేక పూజలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.
ఈ సందర్భంగా అన్న ప్రసాద వితరణకు సహకరించిన ధోటి శ్రీనివాసులు దంపతులు, బొమ్మ కంటి దేవేందర్ దంపతులు, దోటి కిరణ్ కుమార్, నవ యువ యూత్ ఆధ్వర్యంలో అన్నప్రసాద వితరణ కార్యక్రమం చేపట్టారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని అన్నప్రసాదాన్ని స్వీకరించారు. ఈ కార్యక్రమంలో గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులతో పాటు మహిళలు, చిన్నారులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.భక్తిశ్రద్ధలతో నిర్వహించిన అన్నప్రసాద వితరణ కార్యక్రమం విజయవంతం కావడంతో నిర్వాహకులు ఆనందం వ్యక్తం చేశారు.