prajavaani.net
Newspaper Banner
Date of Publish : 20 September 2026, 7:33 am Digital Edition : PRAJA VANI

నవరాత్రులు పూజలు అందుకుంటున్న గణపయ్య దీవెనలు తీసుకున్న చైర్మన్

నవరాత్రులు పూజలు అందుకుంటున్న గణపయ్య దీవెనలు తీసుకున్న చైర్మన్

* మేదరీవాడ గణపతి వద్ద ప్రత్యేక పూజలుపాల్గొన్న మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ దిలీప్

జమ్మికుంట సెప్టెంబర్ 19 (ప్రజావాణి)

గణపతి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా జమ్మికుంట పట్టణ పరిధిలోని 21వ వార్డు మేదరీవాడ శ్రీ విజ్ఞేశ్వర ఉత్సవ కమిటీ (ఎస్ వి యు సి) వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గణపతి అభిషేకం ప్రత్యేక పూజలో పాల్గొన్న మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ దిలీప్ మాట్లాడుతూ ఈ నవరాత్రులు పూజలు అందుకుంటున్న గణపయ్య దీవెనలు ఈ పూజలో పాల్గొన్నటువంటి అందరిపై మరియు జమ్మికుంట పట్టణ ప్రజలందరిపై ఉండాలని తెలుపుతూ నవరాత్రుల పూజల అనంతరం జరిగేటటువంటి నిమర్జనం కూడా ఇలాగే అందరీ ఐక్యమత్యంతో జరుపుకోవాలని ఎలాంటి అవాంతనీయ సంఘటనలకు చోటులేకుండా అదే భక్తిశ్రద్ధలతో నిమజ్జన కార్యక్రమం కూడా పూర్తి చేయాలని తెలిపారు ఈ కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్ చింతల శ్రీనివాస్ ఎస్ వి యు సి కమిటీ సభ్యులు వినయ్,సాయి నరేందర్,అనిల్ విగ్నేశ్వర స్వామి వారి భక్తులు తదితరులు పాల్గొన్నారు