prajavaani.net
Newspaper Banner
Date of Publish : 28 September 2026, 3:57 pm Digital Edition : PRAJA VANI

నల్గొండలో సత్తా చాటిన చండూరు కరాటే పిల్లలు

నల్గొండలో సత్తా చాటిన చండూరు కరాటే పిల్లలు – 11వ రాష్ట్రస్థాయి ఛాంపియన్ షిప్ లో పతకాల పంట

నల్గొండ జిల్లా ప్రతినిధి ప్రజావాణి

ఆదివారం నల్గొండ జిల్లా కేంద్రంలోని శివాంజనేయ గార్డెన్ లో జరిగిన జిల్లా స్థాయి చోటోకాన్ జే కే 11 వ రాష్ట్రస్థాయి కరాటే ఛాంపియన్ షిప్ పోటీల్లో చండూరు మండల విద్యార్థులు అదరగొట్టారు. చండూర్ కు చెందిన గాంధీజీ స్కూల్, గీతా విద్యాలయం, సన్ షైన్ పాఠశాల, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నుంచి పలువురు విద్యార్థులు పాల్గొని కాంస్య పతకాలు, రజత పతకాలు సాధించి చండూర్ కీర్తిని నల్గొండ జిల్లా స్థాయిలో చాటారు. ఈ సందర్భంగా కరాటే మాస్టర్లు రాపోలు సుదర్శన్, అంతటి సోములు, కల్లూరు నాగేష్, నాగార్జున, శ్రీధర్, సాగర్ లు విజేతలను అభినందించారు. అలాగే చండూరు కు సంబంధించిన కరాటే మాస్టర్లు కారింగ్ రవి, బోడ సాయిరాం లను ప్రత్యేకంగా అభినందించారు. చండూర్ కరాటే మాస్టర్లు కారింగ్ రవి, బోడ సాయిరాం ల గురువైన ఐతరాజు రవి విజేతలను, మాస్టర్లను అభినందించి భవిష్యత్తులో జాతీయ స్థాయిలో రాణించాలని ఆకాంక్షించారు.
విద్యార్థుల తల్లిదండ్రులు, పాఠశాల యాజమాన్యాలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.