prajavaani.net
Newspaper Banner
Date of Publish : 30 September 2026, 8:42 am Digital Edition : PRAJA VANI

నరేంద్ర మోడీ పై రేవంత్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా పెద్ద వంగర మండల నాయకులు దిష్టిబొమ్మ దగ్నం

నరేంద్ర మోడీ పై రేవంత్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా పెద్ద వంగర మండల నాయకులు దిష్టిబొమ్మ దగ్నం
పెద్దవంగర సెప్టెంబర్ 29 ప్రజావాణి
పెద్దవంగర మండల అధ్యక్షుడు భాస్కరాచారి ఆధ్వర్యంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఆందోళన చేపట్టారు.
రేవంత్ రెడ్డి ఆధారాలు లేకుండా ప్రధాని నరేంద్ర మోదీపై ఆరోపణలు చేయడం సరికాదని బీజేపీ నాయకులు అన్నారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత కీలకమైనదని, ఎన్నికల ప్రక్రియపై రాజకీయ ఆరోపణలు చేసే ముందు వాస్తవాలను ప్రజల ముందుంచాలని డిమాండ్ చేశారు.
రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు నిరసనగా బీజేపీ నాయకులు ఆయన దిష్టిబొమ్మను ప్రదర్శించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.ప్రజాస్వామ్య వ్యవస్థపై నమ్మకాన్ని దెబ్బతీసేలా ఆరోపణలు చేయకుండా, ఎన్నికల ప్రక్రియపై ఉన్న సందేహాలు ఉంటే ఎన్నికల సంఘం ముందు ఆధారాలతో ఫిర్యాదు చేయాలని బీజేపీ నాయకులు సూచించారు.రాముడు ధనికుల దేవుడు శివుడు పేదల దేవుడని సీఎం చేసిన వ్యాఖ్యానాలు రాజకీయ దుమారానికి దారితీయగా ఓట్ల కోసం హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా మాట్లాడడం సరికాదని అన్నారు.ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను ఖండించారు ఈ యొక్క కార్యక్రమంలో జిల్లా నాయకులు సురేష్, శ్యామ్ మండల ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్, మండల ఉపాధ్యక్షుడు వెంకన్న, ఎస్టి మోర్చా జిల్లా కార్యవర్గసభ్యులు శంకర్, ఓబీసీ మోర్చా జిల్లా కార్యవర్గ సభ్యులు సాయి ప్రసన్న చారి , బి జె వై ఎమ్ అధ్యక్షుడు అన్వేష్, నాయకులు వంశీ, హరీష్ , శ్యామ్,తదితరులు పాల్గొన్నారు.