నకిలీ లాయర్, హ్యూమన్ రైట్స్ ముసుగులో ఘరానా మోసం: పోరుమామిళ్ల మండలంలో లక్షల రూపాయల వసూళ్లు!
పోరుమామిళ్ల ( సెప్టెంబర్ 21 ప్రజావాణి పోరుమామిళ్ల మండలంలో సమాజానికి రక్షణగా నిలవాల్సిన రంగులు మార్చి, నమ్మించి గొంతు కోసే ఒక ఘరానా మోసం వెలుగుచూసింది. తాను ఒక లాయర్ అని, హ్యూమన్ రైట్స్ (మానవ హక్కుల) సంఘం నాయకుడినని చెప్పుకుంటూ ఒక వ్యక్తి అమాయక ప్రజలను నిలువునా ముంచిన ఉదంతం మండలంలో తీవ్ర కలకలం రేపుతోంది. చట్టం, హక్కుల ముసుగులో దాక్కున్న ఈ కేటుగాడు దాదాపు 19 మంది బాధితుల నుండి దాదాపు 40 లక్షల వరకు వసూలు చేసి చేతులెత్తేసినట్లు తెలుస్తోంది....