నందన్ హిల్స్ పార్కులో జమ్మి చెట్టు నాటిన కాంగ్రెస్ నాయకులు…..కాలనీ అభివృద్ధికి శుభారంభంగా జమ్మి వృక్షారోపణ

ఘట్‌కేసర్, సెప్టెంబర్ 27 (ప్రజావాణి): పోచారం డివిజన్ పరిధిలోని కొర్రెముల గ్రామం బాలాజీ నగర్ నందన్ హిల్స్ కాలనీలోని పార్కు స్థలంలో జమ్మి చెట్టు నాటే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. నందన్ హిల్స్ కాలనీ అధ్యక్షుడు శామల శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో పోచారం డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షుడు కర్ర రాజేష్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు బండ్లగూడ నాగేష్ గౌడ్, మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి బండ్లగూడ క్రాంతి గౌడ్, ఘట్‌కేసర్ మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు కేశపావుల వినోద్...