prajavaani.net
Newspaper Banner
Date of Publish : 12 September 2026, 1:43 pm Digital Edition : RAJU NANGUNOOR

నంగునూరు మండలం స్థాయి (ఎస్ జీ ఎఫ్) పోటీల్లో వివిధ పాఠశాలల క్రీడాకారులు సత్తా చాటారు.

“చదువుతో పాటు క్రీడల్లోనూ విద్యార్థులు రాణించాలి.. క్రీడలతో శారీరక దారుఢ్యంతో పాటు క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలు పెంపొందుతాయి. గ్రామీణ ప్రాంత విద్యార్థుల్లో అపారమైన క్రీడా ప్రతిభ దాగి ఉంది. వారికి సరైన ప్రోత్సాహం అందిస్తే జిల్లా, రాష్ట్ర స్థాయిలో సత్తా చాటుతారు” అని నంగునూరు సర్పంచి మండల స్థాయి పాఠశాల క్రీడా సమాఖ్య (ఎస్‌జీఎఫ్‌) కబడ్డీ పోటీల ప్రారంభోత్సవంలో ముఖ్య అతిథులు పేర్కొన్నారు.
నంగునూరులో శుక్రవారం ఎస్‌జీఎఫ్‌ ఆధ్వర్యంలో మండల స్థాయి కబడ్డీ పోటీలను నిర్వహించారు. ఎస్‌జీఎఫ్‌ మండల కార్యదర్శి గందె రాజమౌళి ఆధ్వర్యంలో పోటీలు జరిగాయి.
నంగునూరు ఉన్నత పాఠశాల కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయుడు గొట్టిపర్తి రామస్వామి గౌడ్ అధ్యక్షతన జరిగిన ప్రారంభ కార్యక్రమంలో గ్రామ సర్పంచి సనాదుల బాల పోచయ్య, నంగునూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్‌ చైర్మన్ సాదుల పవన్ కుమార్, ఉప సర్పంచి కోల శ్రీధర్ గౌడ్, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్ గాడిపల్లి వెంకటలక్ష్మి, పోటీల బహుమతులకు విరాళం అందించిన పీఆర్టీయూ నంగునూరు మండల శాఖ అధ్యక్షుడు ఎర్ర పార్థసారథి, నంగునూరు ఉన్నత పాఠశాల ఇన్‌చార్జి ప్రధానోపాధ్యాయుడు దుబ్బుడు రవీందర్ రెడ్డి తదితరులు ముఖ్య అతిథులుగా పాల్గొని పోటీలను ప్రారంభించారు.
క్రీడా ప్రతిభను వెలికితీయాలి
ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ.. విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసేందుకు ఇలాంటి క్రీడా పోటీలు ఎంతో దోహదపడతాయన్నారు. గెలుపే లక్ష్యంగా కాకుండా క్రీడాస్ఫూర్తితో పోటీల్లో పాల్గొనడం ముఖ్యమని పేర్కొన్నారు. ఓటమి నుంచి పాఠాలు నేర్చుకుని మరింత పట్టుదలతో ముందుకు సాగాలని విద్యార్థులకు సూచించారు.
గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థులకు క్రీడల్లో మరిన్ని అవకాశాలు కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు తమ పిల్లలను చదువుతోపాటు క్రీడల్లోనూ ప్రోత్సహించాలని కోరారు.
విజేతలకు బహుమతులు
రోజంతా ఉత్సాహంగా సాగిన కబడ్డీ పోటీల్లో ప్రతిభ కనబరిచి విజయం సాధించిన విద్యార్థులకు శుక్రవారం రాత్రి నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్య అతిథులు బహుమతులు అందజేసి అభినందించారు. క్రీడాకారులు భవిష్యత్తులో జిల్లా, రాష్ట్ర స్థాయి పోటీల్లోనూ రాణించి నంగునూరు మండలానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, శారీరక విద్యా ఉపాధ్యాయులు, విద్యార్థులు, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.

*🏆 మండల స్థాయి క్రీడల్లో విద్యార్థుల సత్తా*

*కబడ్డీ, వాలీబాల్‌, ఖో-ఖోలో పలు విభాగాల్లో ప్రథమ, ద్వితీయ స్థానాలు*

పాఠశాల క్రీడా సమాఖ్య (ఎస్జీఎఫ్) ఆధ్వర్యంలో నిర్వహించిన నంగునూరు మండల స్థాయి క్రీడా పోటీల్లో వివిధ పాఠశాలల విద్యార్థులు ప్రతిభ చాటారు. కబడ్డీ, వాలీబాల్‌, ఖో-ఖో క్రీడల్లో జూనియర్‌, సీనియర్‌ విభాగాల్లో పోటీలు నిర్వహించారు. శుక్రవారం నంగునూరులో నిర్వహించిన కబడ్డీ పోటీలతో మండల స్థాయి ఎస్జీఎఫ్ క్రీడలు ముగిశాయి. ఈ నెల ఒక్కో క్రీడను ఒక రోజు చొప్పున మూడు రోజులు నిర్వహించారు. ఈ నెల ఒకటవ తేదీని మగ్దుంపూర్ ఉన్నత పాఠశాలలో ఖోఖో క్రీడా పోటీలను నిర్వహించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు దాసరి సుధాకర్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో మగ్దుంపూర్ సర్పంచి పాకాల శ్రీనివాస్ ఖోఖో పోటీలను ప్రారంభించారు. ఈ నెల రెండవ తేదీన వాలీబాల్ పోటీలను నర్మెట ఉన్నత పాఠశాలలో నిర్వహించారు. ఈ పోటీలను పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సత్యనారాయణ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ప్రారంభించారు. ఈ నెల మూడవ తేదీన జరగవలసిన మండల స్థాయి కబడ్డీ క్రీడా పోటీలు వర్షం కారణంగా వాయిదా పడ్డాయి. తిరిగి ఈ పోటీలను శుక్రవారం నంగునూరులో నిర్వహించారు. అన్ని విభాగాల్లో కలిపి ఖోఖో పోటీలో 33 జట్లు, వాలీ బాల్ పోటీలో 28 జట్లు, కబడ్డీ పోటీలో 33 జట్లు పాల్గొన్నాయి. మండల క్రీడా సమాఖ్య కార్యదర్శి, నంగునూరు ఉన్నత పాఠశాల శారీరక విద్యా సంచాలకుడు(ఫిజికల్ డైరెక్టర్- పీడీ) గందె రాజమౌళి ఆధ్వర్యంలో పీడీలు లలితాభవాని(పాలమాకుల), దర్శనాల రాజ్ కుమార్(గట్లమల్యాల), భాగ్యలక్ష్మి (నర్మెట) జ్యోతి(రాజగోపాలపేట), శారీరక విద్యా ఉపాధ్యాయులు(ఫిజికల్ విద్యా ఉపాధ్యాయులు- పీఈటీలు) తడకంటి రాజు(మగ్దుంపూర్), నరేశ్(టీఎస్ఎంఎస్ అక్కెనపల్లి), కట్ట రమేశ్(బద్దిపడగ), శారద(కేజీబీవీ నర్మెట) ఈ క్రీడలను నిర్వహించారు.క్రీడలను పలు పాఠశాలల జట్లు ప్రథమ, ద్వితీయ స్థానాలను కైవసం చేసుకున్నాయి.

*🏅 జూనియర్‌ విభాగం*

*కబడ్డీలో..*
బాలుర విభాగంలో టీఎస్ఎంఎస్ అక్కెనపల్లి ప్రథమ స్థానం, మగ్దుంపూర్ ఉన్నత పాఠశాల ద్వితీయ స్థానం సాధించింది. బాలికల విభాగంలో మగ్దుంపూర్ ఉన్నత పాఠశాల ప్రథమ స్థానం, గట్ల మల్యాల ఉన్నత పాఠశాల ద్వితీయ స్థానం పొందాయి.

*వాలీబాల్‌:*

బాలుర విభాగంలో టీఎస్ఎంఎస్ అక్కెనపల్లి ప్రథమ స్థానం, రాజగోపాలపేట ఉన్నత పాఠశాల ద్వితీయ స్థానం సాధించాయి. బాలికల విభాగంలో నర్మెట ఉన్నత పాఠశాల ప్రథమ స్థానం, టీఎస్ఎంఎస్ అక్కెనపల్లి ద్వితీయ స్థానం పొందాయి.

*ఖో-ఖో:*

బాలుర విభాగంలో టీఎస్ఎంఎస్ అక్కెనపల్లి ప్రథమ స్థానం, నర్మెట ఉన్నత పాఠశాల ద్వితీయ స్థానం సాధించాయి. బాలికల విభాగంలో టీఎస్ఎంఎస్ అక్కెనపల్లి ప్రథమ స్థానం, నంగునూరు ఉన్నత పాఠశాల ద్వితీయ స్థానం దక్కించుకున్నాయి.

*🥇 సీనియర్‌ విభాగం*

*కబడ్డీ:*

బాలుర విభాగంలో నంగునూరు ఉన్నత ప్రథమ స్థానం, టీఎస్ఎంఎస్ అక్కెనపల్లి ద్వితీయ స్థానం సాధించాయి. బాలికల విభాగంలో కేజీబీవీ నర్మెట ప్రథమ స్థానం, రాజగోపాల్‌పేట ఉన్నత పాఠశాల ద్వితీయ స్థానం పొందాయి.

*వాలీబాల్‌:*

బాలుర విభాగంలో టీఎస్ఎంఎస్ అక్కెనపల్లి ప్రథమ స్థానం, రాజగోపాలపేట ఉన్నత పాఠశాల ద్వితీయ స్థానం సాధించాయి. బాలికల విభాగంలో నర్మెట ఉన్నత పాఠశాల ప్రథమ స్థానం, మగ్దుంపూర్ ఉన్నత పాఠశాల ద్వితీయ స్థానం పొందాయి.

*ఖో-ఖో:*

బాలుర విభాగంలో గట్ల మల్యాల ఉన్నత పాఠశాల ప్రథమ స్థానం, నర్మెట ఉన్నత పాఠశాల ద్వితీయ స్థానం సాధించాయి. బాలికల విభాగంలో టీఎస్ఎంఎస్ అక్కెనపల్లి ప్రథమ స్థానం, నర్మెట ఉన్నత ద్వితీయ స్థానం పొందింది.

*🎉 విజేతలకు అభినందనలు*

  1. మండల స్థాయి క్రీడా పోటీల్లో ప్రతిభ కనబరిచి ప్రథమ, ద్వితీయ స్థానాలు సాధించిన విద్యార్థులు, జట్లకు ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, క్రీడాభిమానులు అభినందనలు తెలిపారు. క్రీడలతో విద్యార్థుల్లో క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలు, జట్టుగా పనిచేసే తత్వం, ఆత్మవిశ్వాసం పెంపొందుతాయని, మండల స్థాయిలో సత్తా చాటిన విద్యార్థులు జిల్లా, రాష్ట్ర స్థాయి పోటీల్లోనూ రాణించాలని ఆకాంక్షించారు.

ప్రజావాణి,నంగునూరు సెప్టెంబర్ 12:

మండల స్థాయి క్రీడా పోటీల్లో ప్రతిభ కనబరిచి ప్రథమ, ద్వితీయ స్థానాలు సాధించిన విద్యార్థులు, జట్లకు ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, క్రీడాభిమానులు అభినందనలు తెలిపారు. క్రీడలతో విద్యార్థుల్లో క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలు, జట్టుగా పనిచేసే తత్వం, ఆత్మవిశ్వాసం పెంపొందుతాయని, మండల స్థాయిలో సత్తా చాటిన విద్యార్థులు జిల్లా, రాష్ట్ర స్థాయి పోటీల్లోనూ రాణించాలని ఆకాంక్షించారు.