ధూప దీప నైవేద్య అర్చక సంఘం దాతృత్వం: జగన్ కుటుంబానికి ఆర్థిక సహాయం
జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం గుల్లకోట గ్రామానికి చెందిన ధూప దీప నైవేద్య అర్చకుడు సింహాచలం జగన్ అకాల మరణం చెందారు. వారి కుటుంబానికి రాష్ట్ర ధూప దీప నైవేద్య అర్చక సమాఖ్య సంక్షేమ సంఘం తరఫున ₹1,08,720 ఆర్థిక సహాయం అందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు, రాష్ట్ర కన్వీనర్ ఎన్. మహేంద్ర చార్య, పర్వతగిరి ప్రశాంత్ శాస్త్రి, ఓరుగంటి మాధవాచార్యులు, ఆరుట్ల రంగాచార్యులు తదితరులు పాల్గొని, ఆ కుటుంబానికి ఎల్లప్పుడూ అండగా ఉంటామని హామీ ఇచ్చారు.