prajavaani.net
Newspaper Banner
Date of Publish : 21 September 2026, 8:20 am Digital Edition : UPPU RAMESH JAGITHYAL

ధూప దీప నైవేద్య అర్చకుడి కుటుంబానికి రూ.1,08,720 ఆర్థిక సాయం

జగన్ అకాల మరణం తీరని లోటు

జిల్లా డిడిఎన్ అర్చకుల సంఘం

జగిత్యాల స్టాప్ రిపోర్టర్, ఎండపల్లి సెప్టెంబర్ 20 (ప్రజావాణి):

జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం గుల్లకోట గ్రామానికి చెందిన ధూప దీప నైవేద్య అర్చకుడు సింహాచలం జగన్ ఇటీవల అకాల మరణం చెందగా. ఆయన మృతితో ఆవేదనలో ఉన్న కుటుంబ సభ్యులను జగిత్యాల జిల్లా, రాష్ట్ర ధూప దీప నైవేద్య అర్చక సమాఖ్య సంక్షేమ సంఘం పరామర్శించింది. సంఘం ఆధ్వర్యంలో మృతుని కుటుంబానికి రూ.1,08,720 (లక్ష ఎనిమిది వేల ఏడు వందల ఇరవై రూపాయలు) ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ సందర్భంగా జగిత్యాల జిల్లా ధూప దీప నైవేద్య సంఘం అధ్యక్షులు, రాష్ట్ర కన్వీనర్ ఎన్ మహేంద్ర చార్య మాట్లాడుతూ….. అర్చక కుటుంబాలకు సంఘం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని, జగన్ అకాల మరణం తీరని లోటని ఆవేదన వ్యక్తం చేశారు. వారి కుటుంబానికి అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తామని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో డిడిఎన్ ఉమ్మడి వెల్గటూర్ మండల అధ్యక్షులు పర్వతగిరి ప్రశాంత్ శాస్త్రి, రాష్ట్ర క్రమశిక్షణ సంఘం అధ్యక్షులు ఓరుగంటి మాధవాచార్యులు, గుల్లకోట గ్రామ పురోహితులు ఆరుట్ల రంగాచార్యులు, ఇతర అర్చకులు పాల్గొని జగన్ చిత్రపటానికి నివాళులర్పించారు.