అధికారులకు యువకుల వినతి
నల్గొండ జిల్లా ప్రతినిధి ప్రజావాణి
చండూరు పట్టణంలోని అయ్యప్ప స్వామి దేవాలయ మార్గంలో, బ్రహ్మంగారి ఆలయం, గీతా విద్యాలయం పాఠశాలకు సమీపంలో ఉన్న ‘స్వాగత్ వైన్స్’ను తొలగించాలని స్థానిక యువకులు డిమాండ్ చేశారు. నివాస ప్రాంతాల మధ్య వైన్‌షాప్ ఉండటంతో మద్యం సేవించే వారి అసభ్య ప్రవర్తన, బహిరంగ మలమూత్ర విసర్జనతో మహిళలు, భక్తులు, విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. వైన్‌షాప్‌ను పట్టణ శివారుకు తరలించాలని కోరుతూ గురువారం మున్సిపల్ కమిషనర్, ఎక్సైజ్ అధికారులకు, ఆర్డీవో, పోలీసులకు వినతిపత్రాలు అందజేశారు.