prajavaani.net
Newspaper Banner
Date of Publish : 23 September 2026, 4:57 pm Digital Edition : PRAJA VANI

దేవరుప్పుల మండలం లో నిమజ్జన కేంద్రాన్ని పరిశీలించిన డీసీపీ

*దేవరుప్పుల మండలం లో నిమజ్జన కేంద్రాన్ని పరిశీలించిన డీసీపీ*

జనగామ జిల్లా ప్రతినిధి (దేవరుప్పుల), సెప్టెంబర్ 22 (ప్రజావాణి): వినాయక నిమజ్జన ఏర్పాట్లలో భాగంగా జనగామ జిల్లాలోని దేవరుప్పుల మండలం గూడి చెరువు వద్ద ఉన్న ప్రధాన నిమజ్జన కేంద్రాన్ని బుధవారం వెస్ట్ జోన్ డిసిపి రాజా మహేంద్ర నాయక్ ఐపిఎస్, ఏసీపీ వర్ధన్నపేట అంబటి నర్సయ్య, సీఐ పాలకుర్తి భారత్ సుమన్ లు సందర్శించి ఏర్పాట్లను క్షుణ్ణంగా పరిశీలించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిమజ్జనానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పటిష్టమైన బారికేడింగ్ ఏర్పాటు చేయాలని, రాత్రి వేళల్లో సైతం స్పష్టంగా కనిపించేలా విద్యుత్ దీపాల లైటింగ్ వ్యవస్థను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. అలాగే చెరువు వద్ద ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని, గజ ఈతగాళ్లను, ఫైర్ సిబ్బందిని అందుబాటులో ఉంచాలని సూచించారు.

నిమజ్జన సమయంలో శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా పకడ్బందీ బందోబస్తు నిర్వహించాలని, ట్రాఫిక్ క్రమబద్ధీకరణ, భక్తులకు తాగునీటి వసతి వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని ఎస్ఐ దేవరుప్పులకు దిశానిర్దేశం చేశారు.

ఈ పరిశీలన కార్యక్రమంలో దేవరుప్పుల ఎస్ఐ ఊర సృజన్, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.