*దేవరుప్పుల మండలంలో ఝాన్సీ రాజేందర్ రెడ్డి పరామర్శలు*
జనగామ జిల్లా ప్రతినిధి (దేవరుప్పుల), సెప్టెంబర్ 30 (ప్రజావాణి): టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్, పాలకుర్తి నియోజకవర్గం ఇంచార్జ్ హనుమాండ్ల ఝాన్సీ రాజేందర్ రెడ్డి బుధవారం సాయంత్రం జిల్లా లోని దేవరుప్పుల మండలంలోని వివిధ గ్రామాల్లో పర్యటించి, పలు కుటుంబాలను పరామర్శించి ఆర్థిక సహాయం అందజేశారు.
ముందుగా ధర్మాపురం గ్రామంలో దండు సోమయ్య మృతికి సంతాపం తెలిపి కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం ముత్యాల లక్ష్మి శస్త్రచికిత్స గురించి కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు.
తదుపరి దేవరుప్పుల లో తోటకూరి వెంకన్న తల్లి గుండె శస్త్రచికిత్స పరిస్థితిని తెలుసుకుని, కారుపోతుల విజయ్ తండ్రి మృతికి, ఉప్పుల నాగరాజు భార్య మృతికి సంతాపం తెలిపి కుటుంబ సభ్యులను పరామర్శించారు.
అనంతరం రెడ్డిరాజుల రమేష్ ని పరామర్శించి, బొజ్జం సుధీర్ తండ్రి మృతికి, భాషిపాక శోభన్ తల్లి మృతికి సంతాపం తెలిపారు.
తదుపరి కామారెడ్డిగూడెం లో జిలకర కిషన్ గారి భార్య మృతికి, చౌడూర్ లో మాజీ ఎంపీపీ ఇనుముల నర్సయ్య మృతికి సంతాపం తెలిపి కుటుంబ సభ్యులను పరామర్శించారు.
ఈ సందర్భంగా మృతుల కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, వారికి అండగా ఉంటామని ఝాన్సీ రాజేందర్ రెడ్డి భరోసా ఇచ్చారు.