prajavaani.net
Newspaper Banner
Date of Publish : 11 September 2026, 8:47 am Digital Edition : PRAJA VANI

దేచుపాలెం ప్రాథమిక పాఠశాలలో క్రమశిక్షణకు అభినందనలు

దేచుపాలెం ప్రాథమిక పాఠశాలలో క్రమశిక్షణకు అభినందనలు

 

విద్యాబోధనతో పాటు భోజనం, పరిశుభ్రత, క్రీడలకు ప్రాధాన్యత

 

వత్సవాయి సెప్టెంబర్ 10 మన ప్రజావాణి

 

దేచుపాలెం మండల పరిషత్ ఆదర్శ ప్రాథమిక పాఠశాలను సోషల్ యాక్టివిస్ట్, ప్రజాపాలన రిపోర్టర్ అన్నేపాక హరీష్ సందర్శించి విద్యాబోధన, విద్యార్థుల క్రమశిక్షణ, పరిశుభ్రత, వసతులు, మధ్యాహ్న భోజనం, క్రీడా కార్యక్రమాలను పరిశీలించారు.

 

పాఠశాలలో విద్యార్థుల క్రమశిక్షణ, యూనిఫామ్, పరిశుభ్రత, తాగునీటి సౌకర్యం, రుచికరమైన పోషకాహారం ఆకట్టుకున్నాయని హరీష్ తెలిపారు. విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేసి ఆహారం నాణ్యతపై సంతృప్తి వ్యక్తం చేశారు.

 

“ఒక పేదవాడి గౌరవాన్ని నిలబెట్టేది ఒక చదువు మాత్రమే. ప్రతి ఒక్కరికీ చదువు ఉండాలి, ప్రతి ఒక్కరూ చదువుకోవాలి.” అని పేర్కొంటూ, విద్యార్థులందరూ కష్టపడి మంచి చదువులు చదివి జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలని సూచించారు.

మధ్యాహ్న భోజనం అనంతరం విద్యార్థులకు క్యారమ్స్, చెస్ వంటి ఆటలను ప్రోత్సహించడం ద్వారా వారి మానసిక వికాసానికి తోడ్పడుతున్న తీరు అభినందనీయమన్నారు.

 

ప్రధానోపాధ్యాయులు అంగజాల రవీంద్ర బాబు, ఎస్‌జీటీ ఉపాధ్యాయులు మండి వెంకటేశ్వర్లు, సూర్యపల్లి కృష్ణారావు ఆధ్వర్యంలో పాఠశాలను చక్కగా నిర్వహిస్తున్న తీరును హరీష్ ప్రత్యేకంగా అభినందించారు.

 

విద్య, క్రమశిక్షణ, పరిశుభ్రత, పోషకాహారం, క్రీడలను సమన్వయం చేస్తూ దేచుపాలెం పాఠశాల ఇతర పాఠశాలలకు ఆదర్శంగా నిలవాలని ఆయన ఆకాంక్షించారు.