prajavaani.net
Newspaper Banner
Date of Publish : 27 September 2026, 10:32 am Digital Edition : RAJASHEKARREDDY

దుర్వాసనతో ఉక్కిరిబిక్కిరి దుర్వాసనతో ఉక్కిరిబిక్కిరి.. ఊరు వదిలి వెళ్లాలా….?

ఇథనాల్ ఫ్యాక్టరీల దుర్వాసనతో డబుల్ బెడ్రూమ్ ఇళ్లవాసుల అవస్థలు

అన్నం తినలేకపోతున్నాం.. వాంతులు, చర్మంపై దురదతో ఇబ్బందులు

రాత్రివేళల్లో మరింత తీవ్రంగా దుర్వాసన.. తక్షణ చర్యలకు డిమాండ్

బెజ్జంకి, సెప్టెంబర్ 27 (ప్రజావాణి)

సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల కేంద్రంలోని డబుల్ బెడ్రూమ్ ఇళ్లవాసులు ఇథనాల్ ఫ్యాక్టరీల నుంచి వస్తున్న దుర్వాసనతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఇళ్లలో ప్రశాంతంగా ఉండలేకపోతున్నామని, ముఖ్యంగా రాత్రి వేళల్లో దుర్వాసన మరింత తీవ్రంగా ఉంటోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
దుర్వాసన కారణంగా అన్నం తినలేకపోతున్నామని, వాంతులు వస్తున్నాయని, కొందరికి చర్మంపై దురద వంటి సమస్యలు ఎదురవుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. చిన్నారులు, వృద్ధులు సైతం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.
ఊరు వదిలి వెళ్లాల్సిందేనా? అంటూ బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రజల ఆరోగ్యంపై అధికారులు నిర్లక్ష్యం చేయకుండా వెంటనే స్పందించాలని కోరుతున్నారు. సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి దుర్వాసనకు కారణాలను గుర్తించాలని, నిబంధనలు ఉల్లంఘించినట్లు తేలితే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.ప్రజల ఆరోగ్యంపై రాజీ పడకుండా సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని డబుల్ బెడ్రూమ్ ఇళ్లవాసులు కోరుతున్నారు.