prajavaani.net
Newspaper Banner
Date of Publish : 08 September 2026, 4:13 pm Digital Edition : PRAJA VANI

దిష్టిబొమ్మ దగ్ధం వేళ పోలీసులు చొక్కా పట్టుకోవడం పై ఆగ్రహం

దిష్టిబొమ్మ దగ్ధం వేళ పోలీసులు చొక్కా పట్టుకోవడం పై ఆగ్రహం 

–యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడి చొక్కా పట్టుకొని లాగడంపై తీవ్ర అభ్యంతరం..

— పోలీసుల తీరును ఖండించిన సంగీతం శ్రీనాథ్

సిరిసిల్ల, ప్రజావాణి

సిరిసిల్ల పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ తాత మధుసూదన్ దిష్టిబొమ్మ దగ్ధం చేస్తున్న సమయంలో కాంగ్రెస్ నాయకులకు పోలీసుల మధ్య  తోపులాట చోటుచేసుకుంది. ఈ సందర్భంగా పోలీసులు పట్టణ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు దేవరాజ్ చొక్కా పట్టుకొని లాగారని కాంగ్రెస్ నాయకుడు సంగీతం శ్రీనాథ్ ఆరోపించారు.దిష్టిబొమ్మ దగ్ధం వంటి ఆందోళన కార్యక్రమాల్లో కార్యకర్తల మధ్య తోపులాటలు సాధారణమేనని, అయితే చొక్కా పట్టుకొని లాగడం ఏమిటని ఆయన పోలీసులను ప్రశ్నించారు. చొక్కా పట్టుకోవడమే కాకుండా దేవరాజ్‌పై లాఠీలతో పోలీసులు రావడాన్ని తీవ్రంగా ఖండించారు.ఆందోళనకారులను అదుపులోకి తీసుకునే క్రమంలో పోలీసులు సంయమనం పాటించాల్సి ఉండగా, ఈ విధంగా వ్యవహరించడం సరికాదని సంగీతం శ్రీనాథ్ మండిపడ్డారు. “చొక్కా పట్టుకోవడం తప్పు.. పోలీసులు తమ తీరు మార్చుకోవాలి” అంటూ పోలీసులను నిలదీశారు. ఘటనపై కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.