దివంగత భిక్షపతిరెడ్డి దశదిన కర్మలో రాజకీయ ప్రముఖుల నివాళులు…ఎస్బీఆర్ గార్డెన్‌లో అశ్రునయనాల మధ్య ఘనంగా కార్యక్రమం

ఘట్‌కేసర్, సెప్టెంబర్ 27 (ప్రజావాణి): పోచారం మున్సిపాలిటీ పరిధిలోని అన్నోజిగూడకు చెందిన సింగిరెడ్డి సాయిరెడ్డి, సింగిరెడ్డి శ్రీకాంత్ రెడ్డిల పితృమూర్తి దివంగత సింగిరెడ్డి భిక్షపతిరెడ్డి దశదిన కర్మ ఆదివారం ఎస్బీఆర్ గార్డెన్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు రాజకీయ ప్రముఖులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, బంధుమిత్రులు, అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరై భిక్షపతిరెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి మాజీ జడ్పీ చైర్‌పర్సన్ పట్నం సునీతా మహేందర్‌రెడ్డి, మల్లారెడ్డి విశ్వవిద్యాలయం చైర్మన్ చామకూర భద్రారెడ్డి, మేడ్చల్ జిల్లా ఇంచార్జి తోటకూర వజ్రేష్...