ఘట్‌కేసర్, సెప్టెంబర్ 27 (ప్రజావాణి): పోచారం మున్సిపాలిటీ పరిధిలోని అన్నోజిగూడకు చెందిన సింగిరెడ్డి సాయిరెడ్డి, సింగిరెడ్డి శ్రీకాంత్ రెడ్డిల పితృమూర్తి దివంగత సింగిరెడ్డి భిక్షపతిరెడ్డి దశదిన కర్మ ఆదివారం ఎస్బీఆర్ గార్డెన్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు రాజకీయ ప్రముఖులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, బంధుమిత్రులు, అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరై భిక్షపతిరెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ కార్యక్రమానికి మాజీ జడ్పీ చైర్‌పర్సన్ పట్నం సునీతా మహేందర్‌రెడ్డి, మల్లారెడ్డి విశ్వవిద్యాలయం చైర్మన్ చామకూర భద్రారెడ్డి, మేడ్చల్ జిల్లా ఇంచార్జి తోటకూర వజ్రేష్ యాదవ్, హరివర్ధన్ రెడ్డి, వేముల మహేష్ గౌడ్, అతిథులుగా హాజరయ్యారు. భిక్షపతిరెడ్డి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించి, సాయిరెడ్డి, శ్రీకాంత్ రెడ్డిలను పరామర్శించారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
ప్రజాసేవలో సింగిరెడ్డి సోదరుల సేవలు అభినందనీయం
ఈ సందర్భంగా ప్రముఖులు మాట్లాడుతూ సింగిరెడ్డి సాయిరెడ్డి, సింగిరెడ్డి శ్రీకాంత్ రెడ్డిలు ప్రజా సేవలో చూపుతున్న చొరవ అభినందనీయమన్నారు. భిక్షపతిరెడ్డి తన కుమారులను ఉన్నత విలువలతో తీర్చిదిద్దారని పేర్కొన్నారు. ప్రజల కష్టసుఖాల్లో అండగా ఉంటూ, నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడుతున్న సింగిరెడ్డి సోదరులకు ప్రజల్లో మంచి ఆదరణ ఉందన్నారు. ప్రజాసేవే లక్ష్యంగా ముందుకు సాగుతున్న వారికి ప్రజల ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు.
భారీగా తరలివచ్చిన నాయకులు, ప్రజలు…
దశదిన కర్మ కార్యక్రమానికి మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాకు చెందిన పలువురు రాజకీయ నాయకులు, వివిధ పార్టీల ప్రముఖులు, పోలీస్ అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, బంధుమిత్రులు, అభిమానులు, నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు. అనంతరం విచ్చేసిన అతిథులు, బంధుమిత్రులకు భిక్షపతిరెడ్డి స్మృతిలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.

