prajavaani.net
Newspaper Banner
Date of Publish : 21 September 2026, 8:47 pm Digital Edition : PRAJA VANI

దాన ధర్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గర్భిణీ స్త్రీలకు శ్రీమంత వేడుక

దాన ధర్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గర్భిణీ స్త్రీలకు శ్రీమంత వేడుక

దమ్మపేట, ప్రజావాణి న్యూస్, సెప్టెంబర్ 21:
దానధర్మ చారిటబుల్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట గ్రామంలో అయ్యప్ప స్వామి వారి ఆలయ ప్రాంగణంలో దానధర్మా చారిటబుల్ ట్రస్ట్ స్వామీజీ అరుణానంద స్వామి ఆధ్వర్యంలో 80 మంది వెనకబడిన తరగతులు పేద గర్భిణీ స్త్రీలకు ఉచితంగా శ్రీమంతాలు జరిపించారు.
చీర,పళ్ళు, పువ్వులు,తాంబూలం, పసుపు,కుంకుమ, స్వీట్స్ గాజులు గర్భిణీ స్త్రీలకు అలంకరించి గౌరవించడం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీ విద్యా ఉపాసకులు అరుణానంద స్వామి మరియు చిన్న అరుణాచల స్వామి, మాతాజీలు గ్రామ సర్పంచ్,దానధర్మా చారిటబుల్ ట్రస్ట్ కార్యకర్త కొండయ్య మరియు ఆరోగ్యశాఖ వారు తదితరులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి గర్భిణీ స్త్రీలను ఆశీర్వదించడం జరిగింది. ఈ కార్యక్రమానికి వచ్చిన గర్భిణీ స్త్రీలకు, భక్తులకి మంచినీళ్లు,మజ్జిగ,మధ్యాహ్నం ఆహారం అయ్యప్ప స్వామి ఆలయ కమిటీ సభ్యులు ఏర్పాటు చేశారు.