దాతల సహకారంతో జై గట్టు మైసమ్మ ఆటో స్టాండ్ వద్ద అన్నదానం
ఘట్కేసర్, సెప్టెంబర్ 16 (ప్రజావాణి): ఘట్కేసర్–ఎడులాబాద్ రోడ్డు పరిధిలోని జై గట్టు మైసమ్మ ఆటో స్టాండ్ వద్ద ఆటో యూనియన్ సభ్యుల ఆధ్వర్యంలో దాతల సహకారంతో అన్నదాన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు, ప్రయాణికులు, స్థానికులకు అన్నప్రసాదాన్ని పంపిణీ చేశారు. దాతల సహకారంతో నిర్వహించిన ఈ అన్నదాన కార్యక్రమానికి ప్రజల నుంచి మంచి స్పందన లభించింది. సేవా కార్యక్రమాల ద్వారా సమాజానికి తమ వంతు సహకారం అందించాలనే ఉద్దేశంతో ఆటో యూనియన్ సభ్యులు కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు. భక్తులకు అన్నప్రసాదం అందిస్తూ,...