prajavaani.net
Newspaper Banner
Date of Publish : 17 September 2026, 6:51 am Digital Edition : NNARSINGARAO GATKESKAR

దాతల సహకారంతో జై గట్టు మైసమ్మ ఆటో స్టాండ్‌ వద్ద అన్నదానం

ఘట్కేసర్, సెప్టెంబర్‌ 16 (ప్రజావాణి): ఘట్కేసర్‌–ఎడులాబాద్‌ రోడ్డు పరిధిలోని జై గట్టు మైసమ్మ ఆటో స్టాండ్‌ వద్ద ఆటో యూనియన్‌ సభ్యుల ఆధ్వర్యంలో దాతల సహకారంతో అన్నదాన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు, ప్రయాణికులు, స్థానికులకు అన్నప్రసాదాన్ని పంపిణీ చేశారు.

దాతల సహకారంతో నిర్వహించిన ఈ అన్నదాన కార్యక్రమానికి ప్రజల నుంచి మంచి స్పందన లభించింది. సేవా కార్యక్రమాల ద్వారా సమాజానికి తమ వంతు సహకారం అందించాలనే ఉద్దేశంతో ఆటో యూనియన్‌ సభ్యులు కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు. భక్తులకు అన్నప్రసాదం అందిస్తూ, కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు సభ్యులు సమన్వయంతో పనిచేశారు.

ఈ కార్యక్రమంలో తోక రాజు, ఎజ్జల రాజేష్‌, మార్కల రాజు, జి. నరసింహ, శ్రీశైలం, రవి, మైసయ్య, ఎజ్జల శ్రీను, బలవంత, కె. శ్రీను, శంకర్‌, విజయ్‌, జంగయ్య, సీహెచ్‌. విజయ్‌, పాముల రాములు, తోక మల్లేష్‌, మేకల సునీల్‌, ఎర్రోళ్ల సాయికిరణ్‌, చుక్క శ్రీను, తిక్క సుధాకర్‌, గడ్డం అశోక్‌ తదితర ఆటో యూనియన్‌ సభ్యులు పాల్గొన్నారు.