prajavaani.net
Newspaper Banner
Date of Publish : 17 September 2026, 9:00 pm Digital Edition : RAJASHEKARREDDY

దాచారం గ్రామంలో వినాయక మండపాన్ని సందర్శించిన బెజ్జంకి ఎస్సై తోట

భక్తిశ్రద్ధలతో, ప్రశాంత వాతావరణంలో ఉత్సవాలు నిర్వహించుకోవాలి

బెజ్జంకి, సెప్టెంబర్ 17 (ప్రజావాణసిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల పరిధిలోని దాచారం గ్రామ ముదిరాజ్ కాలనీలో ఏర్పాటు చేసిన వినాయక మండపాన్ని బెజ్జంకి ఎస్సై తోట తిరుపతి సందర్శించి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అనంతరం గ్రామ సర్పంచ్ బైరా మానస రాజేందర్ కూడా వినాయకుడిని దర్శించుకుని పూజలు నిర్వహించారు.మండపం వద్ద ఏర్పాటు చేసిన నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో ఎస్సై తోట తిరుపతి, సర్పంచ్ బైరా మానస రాజేందర్ పాల్గొన్నారు .ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ వినాయక చవితి ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో, ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలని సూచించారు.ఉత్సవ కమిటీ సభ్యులు పోలీసులకు సహకరిస్తూ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా జాగ్రత్తలు పాటించాలని, ప్రజలందరూ సోదరభావంతో పండుగను ఆనందంగా జరుపుకోవాలని కోరారు.కార్యక్రమంలో వినాయక ఉత్సవ కమిటీ సభ్యులు, ముదిరాజ్ కాలనీ యువకులు, గ్రామ ప్రజలు, భక్తులు పాల్గొన్నారు.