prajavaani.net
Newspaper Banner
Date of Publish : 19 September 2026, 12:07 pm Digital Edition : PRAJA VANI

దాచారం గ్రామంలో గౌడ కులస్తులకు 600 ఈత మొక్కల పంపిణీ

దాచారం గ్రామంలో గౌడ కులస్తులకు 600 ఈత మొక్కల పంపిణీ

పచ్చదనం పెంపుతో పాటు గౌడ కుటుంబాలకు ప్రయోజనం

బెజ్జంకి,సెప్టెంబర్ 19 (ప్రజావాణి)

సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని దాచారం గ్రామంలో గౌడ కులస్తులకు ఈత మొక్కలను సర్పంచ్ బైరా మానస రాజేందర్ అందజేశారు.అనంతరం ఎల్లమ్మ గుడి పరిసర ప్రాంతంలో సుమారు 600 ఈత మొక్కలను నాటించారు.ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ
గ్రామంలో పచ్చదనం పెంపొందించడంతో పాటు గౌడ కుటుంబాలకు భవిష్యత్తులో ఉపయోగపడేలా ఈ కార్యక్రమం చేపట్టినట్లు సర్పంచ్ తెలిపారు. నాటిన ప్రతి మొక్కను సంరక్షించే బాధ్యతను గ్రామస్తులు తీసుకోవాలని ఆమె కోరారు.ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ దీటి బాలనర్స్, వార్డు సభ్యుడు గదగోని అశోక్, గౌడ సంఘం అధ్యక్షుడు బొడిగే సతీష్, ఉపాధ్యక్షుడు ఇల్లందుల బాలరాజు, గౌడ కులస్తులు, యువత, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.