prajavaani.net
Newspaper Banner
Date of Publish : 22 September 2026, 4:26 pm Digital Edition : PRAJA VANI

దాచారంలో అమ్మ పేరిట మొక్క నాటి ‘మాకే నామ్ ఎక్ పేడ్’ కార్యక్రమం

దాచారంలో అమ్మ పేరిట మొక్క నాటి ‘మాకే నామ్ ఎక్ పేడ్’ కార్యక్రమం

మొక్కల నాటకం
మొక్కలు నాటి సంరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత_సర్పంచ్ మానస రాజేందర్

బెజ్జంకి, సెప్టెంబర్ 22 (ప్రజావాణి)

‘మాకే నామ్ ఎక్ పేడ్’ కార్యక్రమంలో భాగంగా సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని దాచారం గ్రామ సర్పంచ్ బైరా మానస రాజేందర్ ఆధ్వర్యంలో అమ్మ పేరిట మొక్కను నాటి కార్యక్రమాన్ని ప్రారంభించారు.దాచారం ప్రభుత్వ పాఠశాల నుంచి దాచారం స్టేజ్ మీదుగా బెజ్జంకి వెళ్లే ప్రధాన రహదారి వరకు పెద్ద ఎత్తున మొక్కలు నాటారు.
ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ మొక్కలు నాటడం మాత్రమే కాకుండా వాటిని సంరక్షించి పెంచడం ప్రతి ఒక్కరి బాధ్యత అని చెట్లు స్వచ్ఛమైన గాలి, నీడను అందించడంతో పాటు వాతావరణ సమతుల్యతకు, భవిష్యత్ తరాలకు ఆరోగ్యకరమైన పర్యావరణానికి దోహదపడతాయని తెలిపారు.“నేడు నాటే ప్రతి మొక్క రేపటి తరాలకు జీవనాధారం. ప్రతి ఇంటి నుంచి ఒక మొక్క నాటి, దాన్ని బాధ్యతగా సంరక్షిస్తేనే మన గ్రామం పచ్చని గ్రామంగా మారుతుంది” అని పిలుపునిచ్చారు. పెరుగుతున్న కాలుష్యం, వాతావరణ మార్పుల నేపథ్యంలో చెట్ల సంరక్షణను సామాజిక బాధ్యతగా స్వీకరించాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ దీటి బాలనర్సు, వార్డు సభ్యులు, పాఠశాల హెచ్‌ఎం నరేందర్ రెడ్డి, ఉపాధ్యాయులు రవీందర్ రెడ్డి, మల్లారెడ్డి, కార్యదర్శి సురేష్, ఉపాధి హామీ మేట్లు రమ, చెందయ్య, సతీష్, లింగం, రాజయ్య, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.