prajavaani.net
Newspaper Banner
Date of Publish : 18 September 2026, 8:19 am Digital Edition : SURENDHARTEKUMATLA TEKUMATLA

దళిత సంఘాల ధర్నా

•ఎలుకటి రాజయ్య

మారాపెల్లి మల్లేష్

టేకుమట్ల/ప్రజావాణి: బాబా సాహెబ్ అంబేద్కర్ ను అవమానించే విధంగా రచనలు చెయ్యడం జాతిని అవమానించడమే అని దళిత ద్రోహి హమారా ప్రసాద్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ దళిత ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్బంగా దళిత ప్రజా సంఘాల నాయకులు ఎలుకటి రాజయ్య, మారాపెల్లి మల్లేష్ మాట్లాడుతూ హమారా ప్రసాద్ అనే దళిత ద్రోహి బీజేపీ మతోన్మాద శక్తులతో చేతులు కలిపి రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్ అంబేద్కర్ అవమానించే విధంగా కల్పిత నాయకుడు అని రచనలు చేయడం దళిత జాతిని అవమానించడమే అని అన్నారు. రాజ్యాంగం కల్పించిన హక్కుల ద్వారానే దేశంలో స్వేచ్చ తో హమారా ప్రసాద్ లాంటి దేశ ద్రోహులు విచ్చలవిడిగా మాట్లాడుతూ, రాజ్యాంగం రచించిన మహోన్నత వ్యక్తి అంబేద్కర్ ను హేళన చేస్తూ మాట్లాడుతున్నారని, ఇకనైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వలు స్పందించి ఇలాంటి వాఖ్యలు చేస్తున్న హామర్ ప్రసాద్ లాంటి వ్యక్తులను గుర్తించి వారిపై దేశ ద్రోహం కేసులు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో నాయకులు దాసారపు. భాస్కర్,మారపెల్లి రాజకొమురయ్య, అంబాల రమేష్,రాజయ్య, అంబాల అశ్వథామ,మారపెల్లి. కొమురయ్య,బొజ్జపెల్లి ప్రభాకర్,ఆకునూరి మధునయ్య,జీడీ సదయ్య బూడిది కొమురయ్య, బొజ్జపెల్లి తదితరులు పాల్గొన్నారు.