దళిత జర్నలిస్ట్ ఫోరం 11వ రాష్ట్ర మహాసభల గోడపత్రిక ఆవిష్కరణ
కౌడిపల్లి సెప్టెంబర్ 28: సంగారెడ్డి జిల్లా ప్రతినిధి
సంగారెడ్డిలో అక్టోబర్ 7న జరగనున్న దళిత జర్నలిస్ట్ ఫోరం ( డి జె ఎఫ్ ) 11వ రాష్ట్ర మహాసభల గోడపత్రికను కౌడిపల్లి సీఐ అమర్ ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా మహాసభలను విజయవంతం చేయడానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని నిర్వాహకులు కోరారు. కార్యక్రమంలో నాయకులు మాదిగ బుచ్చయ్య, దుర్గయ్య, కుమార్ తదితరులు పాల్గొన్నారు.