దళిత జర్నలిస్ట్ ఫోరం 11వ రాష్ట్ర మహాసభల విజయవంతానికి సన్నాహక సమావేశం
సంగారెడ్డి: సెప్టెంబర్ 26 :మన సమగ్ర ప్రజావాణి
సంగారెడ్డి జిల్లా కేంద్రంలో అక్టోబర్ 7న జరగనున్న దళిత జర్నలిస్టుల ఫోరం డి జె ఎఫ్ 11వ రాష్ట్ర మహాసభలను విజయవంతం చేసేందుకు సన్నాహక సమావేశం నిర్వహించారు.
డి జె ఎఫ్ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు కాశపోగు జాన్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న ఈ సన్నాహక సమావేశంలో మహాసభల ఏర్పాట్లు, కార్యక్రమ విజయవంతానికి చేపట్టాల్సిన చర్యలు, జర్నలిస్టుల భాగస్వామ్యం తదితర అంశాలపై చర్చించారు. మహాసభలను విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్కరూ సమన్వయంతో పనిచేయాలని నాయకులు పిలుపునిచ్చారు.