prajavaani.net
Newspaper Banner
Date of Publish : 21 September 2026, 2:28 pm Digital Edition : PRAJA VANI

దళిత జర్నలిస్ట్ ఫోరం 11వ రాష్ట్ర మహాసభల కరపత్రం ఆవిష్కరణ

దళిత జర్నలిస్ట్ ఫోరం 11వ రాష్ట్ర మహాసభల కరపత్రం ఆవిష్కరణ

• జోగిపేట సీఐ అనిల్ కుమార్ చేతుల మీదుగా కరపత్రం ఆవిష్కరణ

మన సమగ్ర ప్రజావాణి సెప్టెంబర్ 21 (జోగిపేట )సంగారెడ్డి జిల్లా ప్రతినిధి

దళిత జర్నలిస్ట్ ఫోరం 11వ రాష్ట్ర మహాసభలకు సంబంధించిన కరపత్రాన్ని జోగిపేట సీఐ అనిల్ కుమార్ ఆవిష్కరించారు. దళిత జర్నలిస్ట్ ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు తలారి యాదగిరి సమక్షంలో ఈ కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా అక్టోబర్ 7న సంగారెడ్డిలో నిర్వహించనున్న 11వ రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని నిర్వాహకులు పిలుపునిచ్చారు. జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి దళిత జర్నలిస్ట్ ఫోరం చేస్తున్న కృషిని వివరించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి జోగ్యల్ల రాజు, జిల్లా కార్యవర్గ సభ్యులు మాదిగ బుచ్చయ్య, అమరేందర్ తదితరులు పాల్గొన్నారు.