దళిత జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలి

*దళిత జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలి* టేక్మాల్, సెప్టెంబర్ 29: మన సమగ్ర ప్రజావాణి సంగారెడ్డి జిల్లా ప్రతినిధి సంగారెడ్డి జిల్లా కేంద్రంలో అక్టోబర్ 7న నిర్వహించనున్న దళిత జర్నలిస్ట్ ఫోరం 11వ రాష్ట్ర మహాసభల వాల్ పోస్టర్‌ను మంగళవారం టేక్మాల్ మండల కేంద్రంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని దళిత జర్నలిస్టులందరూ పెద్ద సంఖ్యలో తరలివచ్చి మహాసభలను విజయవంతం చేయాలని జర్నలిస్ట్ నాయకులు పిలుపునిచ్చారు. దళిత జర్నలిస్టుల కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని, ప్రతి దళిత జర్నలిస్టుకు అక్రిడేషన్ సౌకర్యం కల్పించాలని వారు...