prajavaani.net
Newspaper Banner
Date of Publish : 24 September 2026, 4:49 pm Digital Edition : PRAJA VANI

దళితుల పై ఇంకెన్నాళ్లు ఈ వివక్ష

దళితుల పై ఇంకెన్నాళ్లు ఈ వివక్ష

దూల మిట్ట మండల అధ్యక్షుడు నల్ల రాజేష్ మాదిగ

మద్దూరు సెప్టెంబర్ 24, ప్రజా వాణి,

సిద్దిపేట పట్టణం ఇమాంబాద్ 22వ డివిజన్ లో వినాయక నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా జరిగినటువంటి అన్నదాన కార్యక్రమంలో మాదిగలకు ప్రత్యేక కౌంటర్ పెట్టడంపై దూలిమిట్ట మండల ఏం అర్ పి ఎస్ మండల అద్యక్షులు నల్ల రాజేష్ మాదిగ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా మండల కేంద్రంలో ఏర్పాటు చేసినటువంటి సమావేశంలో మాట్లాడుతూ ప్రపంచమంతా అభివృద్ధి వైపు పరిగెడుతుంటే ఈ భారతదేశంలో ప్రజలందరూ కులమత వర్గ పోరాటాల్లోనే వారి సమస్త శాసక్తులు ధారపోస్తున్నారని ఈ పద్ధతి ఇంకా మారాలని లేని పక్షంలో ఎమ్మార్పీఎస్ ఖచ్చితంగా బాధ్యులపై కఠిన చర్యలు తీసుకునే వరకు పోరాటం చేస్తుందని నిచ్చారు. అదేవిధంగా ఈ కార్యక్రమంలో ఆ సంఘటన పాలుపంచుకున్న బాధ్యులపై కఠిన చర్యలు తీసుకునే విధంగా కలెక్టర్ కు ఫిర్యాదు చేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అధికార ప్రతినిధి గుండె రాజు మాదిగ, మొంగి బాలరాజు మాదిగ, తదితరులు పాల్గొన్నారు.