దళితులపై దాడులు చేసిన భూకబ్జాదారులను వెంటనే అరెస్టు చేయాలి: వ్యవసాయ కార్మిక సంఘం డిమాండ్

కాశి నాయన సెప్టెంబర్ 23 ప్రజావాణి మండల పరిధిలోని నాయన పల్లె రెవెన్యూ పరిధిలో దళితులు, పేదలు సాగు చేసుకుంటున్న ప్రభుత్వ భూములను దౌర్జన్యంగా ఆక్రమించుకుని, వారిపై భౌతిక దాడులకు తెగబడిన వైసిపి నాయకులను వెంటనే అరెస్టు చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. బుధవారం ఉదయం కలసపాడు మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు సగిలి గురవయ్య, మండల అధ్యక్ష కార్యదర్శులు లాజరస్, యర్జా లు మాట్లాడారు. దళితులపై దౌర్జన్యానికి దిగిన...