దళితబంధు సభను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు

* తప్పకుండా పెండింగ్ లో ఉన్న నిధులు మంజూరు చేస్తామని ప్రణవ్ బాబు హామీ ఇచ్చారు
* దళితబంధు సాధన సమితి హుజురాబాద్ నియోజకవర్గ నాయకులు
జమ్మికుంట సెప్టెంబర్ 9 (ప్రజావాణి)
దళితబంధు సాధన సమితి ఆధ్వర్యంలో దళితుల ఆత్మగౌరవ సభను స్థానిక జమ్మికుంట పట్టణంలోని ఎం పి ఆర్ గార్డెన్ లో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వోడితల ప్రణవ్ బాబు హాజరయ్యారు స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా దళితబంధు నిధులు మంజూరు ప్రకియ తాత్కాలికంగా నిలిపివేశారు అప్పటి నుండి ఇప్పటి వరకు అధికారుల దగ్గరికి వెళ్లిన ఎలాంటి సమాచారం ఇవ్వకపోవడంతో లబ్ధిదారులలో ఆందోళన మొదలైంది దళితబంధు సాధన సమితి హుజురాబాద్ నియోజకవర్గ నాయకులు హుజూరాబాద్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ప్రణవ్ బాబు ని కలిసి దళితబంధు విషయం గురించి చర్చించగ తప్పకుండా పెండింగ్ లో ఉన్న నిధులు మంజూరు చేస్తామని ప్రణవ్ బాబు హామీ ఇచ్చారు దళితబంధు సాధన సమితి నియోజకవర్గ ఇంచార్జ్ కొలుగూరి నరేష్ మాట్లాడుతూ నియోజకవర్గం లో ఉన్న లబ్ధిదారులకు త్వరలో నిధులు విడుదల చేస్తారని నమ్మకం కుదిరింది అని ఈరోజు స్థానిక జమ్మికుంట పట్టణంలోని ఎం పి ఆర్ గార్డెన్ లో దళితుల ఆత్మగౌరవ సభ ఏర్పాటు చేసి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హుజురాబాద్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ప్రణవ్ బాబు ని ఆహ్వానించడం జరిగింది ప్రణవ్ బాబు కి దళితుల పట్ల చిత్త శుద్ధి ఉందని చెప్పడానికి ఇదే నిదర్శనం
ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరునా ధన్యవాదాలు తెలుపుతున్నాం
ఈ కార్యక్రమంలో దళితబంధు సాధన సమితి రాష్ట్ర అధ్యక్షుడు కోగిలా మహేష్ హుజురాబాద్ నియోజకవర్గ నాయకులు కోడెపాక రక్షిత్ అకినపల్లి ఆకాష్ ఇనుగాల భిక్షపతి గాజుల కుమార్ సరిగొమ్ముల విజయ్ అకినపల్లి జయ జీడి అరుణ సరిత సౌజన్య శాంతన్ అంబాల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు