prajavaani.net
Newspaper Banner
Date of Publish : 07 September 2026, 12:13 pm Digital Edition : PRAJA VANI

దర్గా రామచంద్రయ్య నూతన గృహప్రవేశానికి హాజరైన బీఆర్‌ఎస్‌ నాయకులు

*దర్గా రామచంద్రయ్య నూతన గృహప్రవేశానికి హాజరైన బీఆర్‌ఎస్‌ నాయకులు*
*మాజీ జెడ్పిటిసి తనయుడురామకృష్ణ*
షాద్ నగర్ ప్రజావాణి సెప్టెంబర్ 06:
నియోజకవర్గంలోని  కొందుర్గ్‌ మండలానికి చెందిన బీఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకులు దర్గా రామచంద్రయ్య నూతనంగా నిర్మించుకున్న గృహంలో గృహప్రవేశ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరై రామచంద్రయ్య కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా కొందుర్గ్‌ మాజీ జెడ్పీటీసీ రామకృష్ణ, కొందుర్గ్‌ బీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు శ్రీధర్‌రెడ్డి, మహదేవ్‌పూర్‌ సర్పంచ్‌ రవీందర్‌రెడ్డి తదితరులు గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్నారు. నూతన గృహంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, రామచంద్రయ్య కుటుంబ సభ్యులతో కలిసి సంతోషాన్ని పంచుకున్నారు.
అనంతరం నాయకులు మాట్లాడుతూ నూతన గృహంలో రామచంద్రయ్య కుటుంబం సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. గృహప్రవేశం సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పలువురు బీఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొని రామచంద్రయ్యకు అభినందనలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ రైతు సమితి అధ్యక్షుడు, సీనియర్‌ నాయకులు రెడ్డి నర్సింహులు, కోట కృష్ణ, తంగెళ్లపల్లి బీఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకులు నగేష్‌, బలరాజ్‌, సత్యనారాయణ, బాలిరెడ్డి, నరసింహరెడ్డి, రాములు, రవి, రాజ్‌కుమార్‌, గణేష్‌ తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమం ఆత్మీయ వాతావరణంలో కొనసాగింది.