దంతాలపల్లి పి ఎం శ్రీ పాఠశాల ఎన్నికల నిర్వహణ
జడ్.పి.హెచ్.ఎస్ దంతాలపల్లి లో స్కూల్ ఎలక్షన్స్-2026
– ప్రధానోపాధ్యాయులకు వేణు
మాధవ్ రెడ్డి
– గ్రామ సర్పంచ్ పొన్నొటి బాలాజీ
దంతాలపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో స్కూల్ ఎలక్షన్స్–2026లో భాగంగా హెడ్ బాయ్, హెడ్ గర్ల్ ఎన్నికలను ప్రత్యక్ష ఓటింగ్ పద్ధతిలో నిర్వహించారు. విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు
హెడ్ గర్ల్ పదవికి అల్లం మహతి, కుంభం పూజ, పేర్ల పల్లవి, హెడ్ బాయ్ పదవికి జాటోత్ గణేష్, పంతం పార్ధు, మంగళంపల్లి కుమారస్వామి పోటీ చేశారు. ఎన్నికల ప్రక్రియలో భాగంగా ప్రచారం, ఓటింగ్, ఓట్ల లెక్కింపు తదితర కార్యక్రమాలను క్రమబద్ధంగా నిర్వహించారు.
ఈ ఎన్నికలను మండల విద్యాశాఖ అధికారి ఎం. శ్రీదేవి, దంతాలపల్లి గ్రామ సర్పంచ్ పొన్నొటి బాలాజీ, ఉప సర్పంచ్ వెంకన్న, పాఠశాలప్రధానోపాధ్యాయులు పి. వేణుమాధవ్ రెడ్డి, సీనియర్ ఉపాధ్యాయురాలు ఏ. శ్రీదేవి, స్టాఫ్ సెక్రటరీ సురేందర్ గుప్తా,పరిశీలించారు. సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయులు, ఏ శ్రీదేవి , ఎం విజయ్ కుమార్, జి సంతోష్ కుమార్, ఎం. యాకన్న ఎన్నిక పరిక్రియను నిర్వహించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు, ప్రజాస్వామ్య విలువలు, బాధ్యతాయుతమైన పౌరసత్వం పెంపొందించేందుకు స్కూల్ ఎలక్షన్స్ ఎంతో ఉపయోగపడతాయని తెలిపారు. కార్యక్రమాన్ని పాఠశాల ఉపాధ్యాయులు, ఉపాధ్యాయినులు సమన్వయంతో నిర్వహించారు.